CYCLONE: తుఫాన పట్ల అప్రమత్తంగా ఉండాలి : తహసీల్దార్
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:47 PM
మొంథా తుఫాన కారణం గా రాబోవు నాలుగురోజులు భారీ ఈదురుగాలులతో వర్షాలు కురి సే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దా ర్ సురేశబాబు తెలిపారు. ఆయన ఆదివారం స్థానిక తహసీల్దార్ కా ర్యాలయంలో వీఆర్‌ఓలతో సమావేశమయ్యారు. తుఫాన ప్రభా వం తీవ్రంగా ఉందని, మట్టిమిద్దెలలో ఎవరూ నివాసం ఉండరా దన్నారు. పరిస్థితి తీవ్రత తగ్గే వరకు ప్రభుత్వ భవనాలలో ఉండాల న్నారు.
ధర్మవరం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన కారణం గా రాబోవు నాలుగురోజులు భారీ ఈదురుగాలులతో వర్షాలు కురి సే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దా ర్ సురేశబాబు తెలిపారు. ఆయన ఆదివారం స్థానిక తహసీల్దార్ కా ర్యాలయంలో వీఆర్‌ఓలతో సమావేశమయ్యారు. తుఫాన ప్రభా వం తీవ్రంగా ఉందని, మట్టిమిద్దెలలో ఎవరూ నివాసం ఉండరా దన్నారు. పరిస్థితి తీవ్రత తగ్గే వరకు ప్రభుత్వ భవనాలలో ఉండాల న్నారు. చెట్లకింద, కరెంటు స్తంభాల కింద ఉండకూడదన్నారు. గర్భి ణుల పరిస్థితిని ఆశాకార్యకర్త లేదా ఏఎనఎం కు తెలపాలన్నారు. నీరున్న చెరువులు, కాలువ వద్దకు వెళ్లవద్దన్నారు. ఎలాంటి అసా ధారణ పరిస్థితి ఉన్నా తహసీల్దార్ కార్యాలయం కంట్రోల్ రూమ్ ఫోన నంబర్ 9553929724కు సమా చారం అందించాలన్నారు. చిత్రావతి నది ప్రాంతాలలో ఉన్న వీఆర్వోలు, ప్రజలు రాబోవు తుఫాన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....