TRAFFIC: రోడ్డుపైనే పార్కింగ్
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:17 PM
పట్టణంలోని కూరగాయల మా ర్కెట్ వద్ద ఉన్న సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయం ఎదుట రోడ్డుపైనే ద్విచ క్రవాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారింది. ఆ రోడ్డు వెళ్లే వాహనదారులు, పాదాచారులు చాలా ఇబ్బందులు పడు తున్నారు. ప్రతి రోజు రిజిసే్ట్రషనల కోసం ఎంతోమంది సబ్‌రిజిసా్ట్రర్ కార్యాలయానికి వస్తుంటారు.
ధర్మవరం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కూరగాయల మా ర్కెట్ వద్ద ఉన్న సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయం ఎదుట రోడ్డుపైనే ద్విచ క్రవాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారింది. ఆ రోడ్డు వెళ్లే వాహనదారులు, పాదాచారులు చాలా ఇబ్బందులు పడు తున్నారు. ప్రతి రోజు రిజిసే్ట్రషనల కోసం ఎంతోమంది సబ్‌రిజిసా్ట్రర్ కార్యాలయానికి వస్తుంటారు. ఆ కార్యాలయం రెండో అంతస్తులో ఉంది. దీంతో రిజిసే్ట్రషనల కోసం వచ్చే వారు వాహనాలను కింద ఉన్న దుకా ణాల ఎదుట నిలిపివెళ్తున్నారు. దీంతో దుకాణదారులు తమ వ్యాపారాల కు ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలు తదితర వాహనాలతో పాటు ఆర్డీసీ బస్సులు కూడా ఆ రోడ్డు వెంట వెళ్తాయి. అయితే రోడ్డుపై వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల వాహనాలు వెళ్లే సమయంలో ట్రాఫిక్ సమస్య జఠిలమై ప్రయాణికులు, వాహనదారులు, పాదాచారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నా రు. ఇప్పటికైనా ద్విచక్రవాహనాలను పార్కింగ్ చేయడానికి సంబంధిత అధికారులు ఏదో ఒక స్థలం చూపించాలని ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....