MINISTER: విద్యార్థుల శ్రేయస్సుకు కృషి : మంత్రి
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:44 AM
విద్యార్థుల శ్రేయస్సుకు కృషి చేస్తున్నామని, ప్రతి విద్యార్థి ఉద్యోగం సాధించాల్నదే తమ ప్రధాన లక్ష్యమని మంత్రి సత్యకుమార్‌యాదవ్ అన్నారు. గత నెల 16న సం స్కృతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నంగ్యాలలోని గురురాఘవేంద్ర బ్యాం కింగ్ కోచింగ్ సెంటర్ సహకారంతో స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో శిక్షణ అర్హత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 120 మంది విద్యార్థులు హాజరయ్యారు
ధర్మవరం, అక్టోబరు 25(ఆంఽధ్రజ్యోతి): విద్యార్థుల శ్రేయస్సుకు కృషి చేస్తున్నామని, ప్రతి విద్యార్థి ఉద్యోగం సాధించాల్నదే తమ ప్రధాన లక్ష్యమని మంత్రి సత్యకుమార్‌యాదవ్ అన్నారు. గత నెల 16న సం స్కృతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నంగ్యాలలోని గురురాఘవేంద్ర బ్యాం కింగ్ కోచింగ్ సెంటర్ సహకారంతో స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో శిక్షణ అర్హత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 120 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ప్రతిభ కనబరచిన 12 మంది విద్యార్థులు ఎంపిక కాగా బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్‌లో ఉచితంగా శిక్షణ పొందే అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు. వారికి శనివారం మంత్రి చేతులమీదుగా ద్రువపత్రాలను అందజేశారు. సంస్కృతి సేవాసమితి కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసరెడ్డి, గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ శ్రయవేల్ రెడ్డి పాల్గొన్నారు.