MINISTER: అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:30 PM
నియోజకవర్గంలో చేపట్టవల సిన అభివృద్ధి పనులపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం రాత్రి రెవిన్యూ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ...నియోజకవర్గం అభివృద్ధి ప ట్ల మన బాధ్యత అత్యంత కీలకమైందన్నారు. ప్రతివార్డు, గ్రామ ప్రజల కు అభివృద్ధి ఫలాలు చేరేలా అధికారులు ప్రణాళికా బద్ధంగా పనిచేయా లని అదేశించారు.
ధర్మవరం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో చేపట్టవల సిన అభివృద్ధి పనులపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం రాత్రి రెవిన్యూ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ...నియోజకవర్గం అభివృద్ధి ప ట్ల మన బాధ్యత అత్యంత కీలకమైందన్నారు. ప్రతివార్డు, గ్రామ ప్రజల కు అభివృద్ధి ఫలాలు చేరేలా అధికారులు ప్రణాళికా బద్ధంగా పనిచేయా లని అదేశించారు. ప్రతి పంచాయతీలో జరుగుతున్న పనులపై త్వరలో నివేదికలు సమర్పించాలన్నారు. ధర్మవరాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ప్రభుత్వం కేటాయించిన నిధులను పారదర్శకంగా వినియోగించాలని సూచించారు. నాణ్యత ప్రధాన ప్రమాణంగా పనులు ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్డీఓ మహేశ, తహసీల్దార్లు సురేశ, నారాయణ స్వామి, స్వర్ణలత, భాస్కర్‌రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....