• Home » Dharmavaram

Dharmavaram

THEFT: రైతులే టార్గెట్‌గా చోరీలు

THEFT: రైతులే టార్గెట్‌గా చోరీలు

కొద్దికాలం క్రితం వరకు ఆలయాలే టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోయారు. ఆలయాల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవడంతో ఇప్పుడు రైతుల పొలాలను టార్గెట్‌గా చేసు కున్నారు. వేలకు వేలు ఖర్చుచేసుకుని పంటలకు విద్యుతకనెక్షన కోసం రైతులు అమర్చుకున్న ట్రాన్స ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని ఆయిల్‌ ను, కాపర్‌ వైర్‌ను ఎత్తుకెళ్తుండడంతో విద్యుతసరఫరా లేక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.

CROP: కందిపై తుఫానల ప్రభావం

CROP: కందిపై తుఫానల ప్రభావం

మండలవ్యాప్తంగా ఖరీఫ్‌లో సాగుచేసిన కంది పంటకు తెగుళ్లు సోకాయి. మండలవ్యా ప్తంగా సుమారు ఏడు వేల హెక్టార్లకు పైగా కంది సాగుచేసినట్లు వ్యవసాయాధికారులు తెలుపుతున్నారు. అయితే ఇటీవల తుఫాన్ల ప్రభావంతో కంది పూత, పిందెపై ప్రభావం చూపుతోంది. పూత రాలిపోవడం, పిందెలను పచ్చపురుగు ఆశించడంతో పంటంతా దెబ్బతింటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

TURN : ప్రమాదకరంగా మలుపు

TURN : ప్రమాదకరంగా మలుపు

మండలంలోని ముచ్చు రామి గ్రామం నుంచి రేగాటిపల్లికి వెళ్లే రహదారిలో ఓ మలుపు ప్రమాద కరంగా మారింది. ఆ మలుపు వద్ద కంపచెట్లు ఏపుగా పెరగడంతో రోడ్డు కనిపించక తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయా గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు రోడ్డు ప్రమాదాల బారిన పడి గాయాలపాలయ్యారు.

HOSPITAL: అరకొర వైద్యం!

HOSPITAL: అరకొర వైద్యం!

పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అరకొర సౌకర్యాలతో సరైన వైద్య సేవలు అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. వంద పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలోని ప్రధాన విభాగాల్లో వైద్య పరికరాలు లేవు. దీంతో మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రులకు రెఫర్‌ చేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. పలువిభాగాల్లో వైద్యుల కొరత కూడా వేధిస్తోంది.

GOD: పెద్దమ్మకు ప్రత్యేక పూజలు

GOD: పెద్దమ్మకు ప్రత్యేక పూజలు

మండల కేంద్రంలోని పాతవూరిలో వెలసిన గ్రామదేవత పెద్దమ్మకు కార్తీక మాసం ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున పూజారులు పెద్దన్న, శివసాయి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, వేప మండలతో ప్రత్యేకంగా అలంకరించారు.

TDP: ప్రజా సమస్యల పరిష్కారానికి సిద్ధం చేయండి

TDP: ప్రజా సమస్యల పరిష్కారానికి సిద్ధం చేయండి

మున్సిపాలిటీతో పాటు ని యోజకవర్గంలోని పలు గ్రామాలు, కాలనీల్లో సమస్యలను పరిష్కరిం చేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ అధికారులకు సూచించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల నేపథ్యంలో పరిటాలశ్రీరామ్‌ ఆదివారం ధర్మవరంలోని తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌తోను, తాడిమర్రి, బ త్తలపల్లి, ముదిగుబ్బ, ధర్మవరం ఎంపీడీఓల తో వేర్వేరుగా సమావే శాలను నిర్వహించారు.

GOD: భక్తిశ్రద్ధలతో కార్తీకమాస పూజలు

GOD: భక్తిశ్రద్ధలతో కార్తీకమాస పూజలు

మండలంలోని గొట్లూరు, చిగిచెర్ల గ్రామాల్లో ని ఆంజనేయస్వామి ఆలయాల్లో శనివారం కార్తీకమాస పూజలు ఘనంగా నిర్వహించారు. మూలవిరాట్‌లను ఆకుపూజతో అలంకరించి పూజలు చేశారు.

GOD: పెద్దమ్మ ఆలయంలో సహస్ర దీపోత్సవం

GOD: పెద్దమ్మ ఆలయంలో సహస్ర దీపోత్సవం

పట్టణంలోని సాలేవీధిలో వెలసిన పెద్దమ్మ దేవత ఆలయంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా సహస్ర దీపోత్సవాన్ని బుగ్గవంశస్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాట్‌ను పట్టువస్ర్తాలు, వివిధ రకాల పూలతో అలంకరించి పూజలు చేశారు.

ROAD: అధ్వానంగా రహదారి

ROAD: అధ్వానంగా రహదారి

పట్టణం నుంచి మామిళ్లప ల్లికి వెళ్లే రహదారి గుంతలు ఏర్పడి అధ్వానంగా తయారైంది. పోతుకుంట బృందావన కాలనీ పోలీస్‌గెస్ట్‌ హౌస్‌ వద్ద నుంచి ధర్మవరంలోకి రహదారి అంతా దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కాలంలో ఈ రహదారిపై ప్యాచ వర్కులు చేసినా నెలలు గడవకముందే రహదారి అంతా ఛిద్ర మవు తోందని ఆ రహదారి గుండా ప్రయాణించే గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.

OFFICES: పరిశుభ్రత పట్టని కార్యాలయాలు

OFFICES: పరిశుభ్రత పట్టని కార్యాలయాలు

స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. మండల స్థాయి కార్యా లయాలన్నీ ఈ ఆవరణంలోనే ఉన్నాయి. దీంతో అన్ని శాఖల అఽధికారు లు ఇక్కడికి రోజూ వచ్చి పోతుంటారు. అదేవిధంగా ప్రతి నెలా మూడో వారం ఉద్యోగులందరూ. కార్యాలయాల పరిసరాలతో పాటు, గ్రామాలలో స్వచ్ఛాంధ్ర - స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని చేపట్టి, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి