GOD: భక్తిశ్రద్ధలతో కార్తీకమాస పూజలు
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:41 PM
మండలంలోని గొట్లూరు, చిగిచెర్ల గ్రామాల్లో ని ఆంజనేయస్వామి ఆలయాల్లో శనివారం కార్తీకమాస పూజలు ఘనంగా నిర్వహించారు. మూలవిరాట్‌లను ఆకుపూజతో అలంకరించి పూజలు చేశారు.
ధర్మవరం రూరల్, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని గొట్లూరు, చిగిచెర్ల గ్రామాల్లో ని ఆంజనేయస్వామి ఆలయాల్లో శనివారం కార్తీకమాస పూజలు ఘనంగా నిర్వహించారు. మూలవిరాట్‌లను ఆకుపూజతో అలంకరించి పూజలు చేశారు. ఆలయాల వద్ద గ్రామస్థులు దీపాలు వెలిగించి స్వామివార్లను దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపీణీ చేశారు. రాత్రివేళాల్లో ఆలయాల్లో భజన కార్యక్రమాలు చేపట్టారు.