CROP: కందిపై తుఫానల ప్రభావం
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:42 AM
మండలవ్యాప్తంగా ఖరీఫ్‌లో సాగుచేసిన కంది పంటకు తెగుళ్లు సోకాయి. మండలవ్యా ప్తంగా సుమారు ఏడు వేల హెక్టార్లకు పైగా కంది సాగుచేసినట్లు వ్యవసాయాధికారులు తెలుపుతున్నారు. అయితే ఇటీవల తుఫాన్ల ప్రభావంతో కంది పూత, పిందెపై ప్రభావం చూపుతోంది. పూత రాలిపోవడం, పిందెలను పచ్చపురుగు ఆశించడంతో పంటంతా దెబ్బతింటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాలిపోతున్న పూత ఫ పచ్చపురుగు దాడి
ధర్మవరంరూరల్, నవంబరు8(ఆంధ్రజ్యోతి): మండలవ్యాప్తంగా ఖరీఫ్‌లో సాగుచేసిన కంది పంటకు తెగుళ్లు సోకాయి. మండలవ్యా ప్తంగా సుమారు ఏడు వేల హెక్టార్లకు పైగా కంది సాగుచేసినట్లు వ్యవసాయాధికారులు తెలుపుతున్నారు. అయితే ఇటీవల తుఫాన్ల ప్రభావంతో కంది పూత, పిందెపై ప్రభావం చూపుతోంది. పూత రాలిపోవడం, పిందెలను పచ్చపురుగు ఆశించడంతో పంటంతా దెబ్బతింటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతు లు ఎరువుల దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. రూ. వేలకు వేలు వెచ్చించి మందులు కోనుగోలు చేసి పిచికారి చేస్తున్నారు. ఈ ఏడాది తుఫాన్లు, వర్షాల ప్రభావం పంటపై చూపిందని, వీటికి తోడు పురుగు ఆశించడంతో పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందనే ఆందోళన కలుగుతోందని రైతులు వాపోతున్నారు. వ్యవసాయా ధికారులు గ్రామాల్లో పర్యటించి పంటను రక్షించేందుకు సలహాలు, సూచనలతో పాటు ఏయే మందులు పిచికారిచేయాలో తెలియ జేయాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు.