Share News

THEFT: రైతులే టార్గెట్‌గా చోరీలు

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:58 PM

కొద్దికాలం క్రితం వరకు ఆలయాలే టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోయారు. ఆలయాల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవడంతో ఇప్పుడు రైతుల పొలాలను టార్గెట్‌గా చేసు కున్నారు. వేలకు వేలు ఖర్చుచేసుకుని పంటలకు విద్యుతకనెక్షన కోసం రైతులు అమర్చుకున్న ట్రాన్స ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని ఆయిల్‌ ను, కాపర్‌ వైర్‌ను ఎత్తుకెళ్తుండడంతో విద్యుతసరఫరా లేక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.

THEFT: రైతులే టార్గెట్‌గా చోరీలు
Destroyed transformers at Tummala

- వ్యవసాయ పొలాల్లోని ట్రాన్సపార్మర్ల ధ్వంసం

- ఆయల్‌, కాపర్‌వైరు చోరీ ఫ బెంబేలెత్తుతున్న రైతులు

ధర్మవరం రూరల్‌, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): కొద్దికాలం క్రితం వరకు ఆలయాలే టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోయారు. ఆలయాల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవడంతో ఇప్పుడు రైతుల పొలాలను టార్గెట్‌గా చేసు కున్నారు. వేలకు వేలు ఖర్చుచేసుకుని పంటలకు విద్యుతకనెక్షన కోసం రైతులు అమర్చుకున్న ట్రాన్స ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని ఆయిల్‌ ను, కాపర్‌ వైర్‌ను ఎత్తుకెళ్తుండడంతో విద్యుతసరఫరా లేక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. మండలంలో రెండురోజుల్లోపే సీతారంపల్లి, తుమ్మల గ్రామాల్లో గుర్తు తెలియని దొంగలు ట్రాన్సఫార్మర్లను ధ్వంసం చేశారు. ధర్మవరం మండల పరిధిలో అధికశాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. పోలీసులు ఫిర్యాదులు తీసుకుని వదిలేస్తుండడంతో దొంగలు పేట్రేగిపో తున్నారని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల పొలాల్లో ట్రాన్సఫార్మర్లను ధ్వంసం చేస్తుండడంతో తీరా చేతికొచ్చే సమ యంలో వేరుశనగ, అలసంద పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆం దోళన చెందుతున్నారు. కొత్త ట్రాన్సఫార్మర్ల కోసం అధికారులను అడిగితే వెంటనే రావని సమాధానం చెబుతున్నారని రైతులు తెలుపుతున్నారు. అయితే తాత్కాలికంగా ట్రాన్సఫార్మర్లను ఏర్పాటుచేయాలని రైతులు కోరుతున్నారు.


ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి రూ. లక్షల్లో పెట్టుబడి పె ట్టి.. ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలను కాపాడుకుంటున్నా... దొంగత నాలతో మరింత నష్టాలు చవిచూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో రైతులు పొలాల వద్ద రైతులు అప్ర మత్తంగా ఉండాలని విద్యుతశాఖ అధికారులు వాట్సప్‌గ్రూప్‌ల ద్వారా మెసేజ్‌లు పంపుతున్నారు. అయితే పోలీసులు మాత్రం నిద్రావస్థలో ఉన్నారని వరుస చోరీలు జరుగుతున్నా గ్రామాల్లో గస్తీ పోలీసులు ఎందుకు కనిపించరని పలువురు ప్రశ్నిస్తున్నారు.

రెండురోజుల్లో ధ్వంసం ఇలా...

- సీతారంపల్లిలో ఈ నెల 5న రైతులు బసిరెడ్డిగారి నారపరెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, హనుమంతరెడ్డి పొలాలకు సంబంధించిన ట్రాన్సఫార్మర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అందులో విలువైన కాపర్‌, ఆయిల్‌ను, విద్యుత పరికరాలను చోరీచేశారు. ఈ రైతులు తమపొలాల్లో వేరుశనగ, వరి, అలసంద, చీనీతోటలను సాగుచేస్తున్నారు. కరెంట్‌ సరఫరా లేక పంటలు ఎండిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. కరెంట్‌ కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

- తుమ్మల గ్రామంలో ఈనెల 7న అర్ధరాత్రి శివారెడ్డి పొలంలో అమర్చిన ట్రాన్స ఫార్మర్‌ను ధ్వంసం చేసి ఆయిల్‌, కాపర్‌తో పాటు విలువైన విద్యుత పరికరాలను ఎత్తుకెళ్లారు. ఆ రైతు తమ పొలంలో చీనీతోట, వేరుశనగ సాగుచేశాడు. అయితే తీరా పంటలు చేతికొచ్చే సమయంలో ట్రాన్సఫార్మర్‌ ధ్వంసం చేయడంతో పంటలు ఎండిపో తాయని ఆ రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. అదే గ్రామంలోనే నరసింహారెడ్డి కి చెందిన గ్రామ సమీపంలోని పట్టుగూళ్లషెడ్డు తాళాలు పగలగొట్టారు. షెడ్డుకు ఉన్న ఫెన్సింగ్‌ను కట్‌చేసి ఎత్తుకెళ్లారు.


- నేలకోట, ఏలుకుంట్ల, బుడ్డారెడ్డిపల్లి, బిల్వంపల్లిల్లో ఇటీవల తరచూ రైతుల పొలాల్లో స్ర్పింక్లర్లు, స్టార్టర్‌ పెట్టెలు, కేబుల్‌, పైపుల చోరీలు జరుగుతున్నాయని ఆ గ్రామ రైతులు ఆవేదనవ్యక్తం చేశారు. పంటలు చేతికొచ్చేసమయంలో ఇలా వ్యవసాయ పరికరాలు చోరీకి గురికావడంతో అదనపు భారం పడుతోందని రైతులు వాపోతున్నారు. ఈ చోరీలపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు తెలిపారు.

చోరీలను అరికడతాం- ప్రభాకర్‌, సీఐ, ధర్మవరం రూరల్‌

చోరీలను అరికట్టేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటుచేశాం. త్వరలోనే దొం గలను పట్టుకుని ఈ చోరీలను అరికడతాం. ఇటీవల దేవాలయాల్లో జరిగిన పలు చోరీలను అరికట్టి, దుండుగలను అరెస్టుచేసి రికవరీ చేశాం. రాత్రివేళాల్లో గస్తీ ముమ్మరం చేసి చోరీలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Nov 09 , 2025 | 11:58 PM