Share News

GOD: పెద్దమ్మ ఆలయంలో సహస్ర దీపోత్సవం

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:30 AM

పట్టణంలోని సాలేవీధిలో వెలసిన పెద్దమ్మ దేవత ఆలయంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా సహస్ర దీపోత్సవాన్ని బుగ్గవంశస్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాట్‌ను పట్టువస్ర్తాలు, వివిధ రకాల పూలతో అలంకరించి పూజలు చేశారు.

GOD: పెద్దమ్మ ఆలయంలో సహస్ర దీపోత్సవం
Lamps lit in Peddamma temple

ధర్మవరం, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సాలేవీధిలో వెలసిన పెద్దమ్మ దేవత ఆలయంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా సహస్ర దీపోత్సవాన్ని బుగ్గవంశస్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాట్‌ను పట్టువస్ర్తాలు, వివిధ రకాల పూలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం మహిళలు దీపా లు వెలిగించి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

Updated Date - Nov 01 , 2025 | 12:30 AM