OFFICES: పరిశుభ్రత పట్టని కార్యాలయాలు
ABN , Publish Date - Oct 30 , 2025 | 11:54 PM
స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. మండల స్థాయి కార్యా లయాలన్నీ ఈ ఆవరణంలోనే ఉన్నాయి. దీంతో అన్ని శాఖల అఽధికారు లు ఇక్కడికి రోజూ వచ్చి పోతుంటారు. అదేవిధంగా ప్రతి నెలా మూడో వారం ఉద్యోగులందరూ. కార్యాలయాల పరిసరాలతో పాటు, గ్రామాలలో స్వచ్ఛాంధ్ర - స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని చేపట్టి, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది.
ముళ్ల కంపలు, పిచ్చి మొక్కల మధ్యే నిత్యం విధులు
ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్న ప్రజలు
నల్లమాడ, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. మండల స్థాయి కార్యా లయాలన్నీ ఈ ఆవరణంలోనే ఉన్నాయి. దీంతో అన్ని శాఖల అఽధికారు లు ఇక్కడికి రోజూ వచ్చి పోతుంటారు. అదేవిధంగా ప్రతి నెలా మూడో వారం ఉద్యోగులందరూ. కార్యాలయాల పరిసరాలతో పాటు, గ్రామాలలో స్వచ్ఛాంధ్ర - స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని చేపట్టి, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. అయితే వారి కార్యాలయాల చుట్టూ ముళ్లకంపలు, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి, అందులో నడవడా నికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఏ అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే తరచూ ఎక్కడో ఒక చోట స్వచ్ఛాంధ్ర - స్వఛ్చభారత కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పే అధికారులు తమ కార్యాలయాల వద్ద పరిస్థితిని ముందు చక్కదిద్దితే ఆదర్శంగా ఉంటుంది కదా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవర ణంలోనే ఎమ్మార్సీ, హౌసింగ్, ఉపాధి హామీ, రైతు సేవా కేంద్రం, వెలుగు, వ్యవసాయం కార్యాలయాలు, రెండు గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాల వెనుక భాగంలో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి అడవిని తలపిస్తున్నాయి. అందులో పగటి పూటే పాములు తిరుగుతుండడం అధికారులే చాలా సార్లు చూశారు. కానీ ఆ పిచ్చి మొక్కలను తొలగించే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించే ప్రయత్నం చేయకపోవడం శోచనీయమని ప్రజలంటున్నారు. చీకటి పడ్డాక ఆ ఆవరణంలోకి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అఽధికారు లు స్పందించి ఆవరణను శుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....