TDP: ప్రజా సమస్యల పరిష్కారానికి సిద్ధం చేయండి
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:40 PM
మున్సిపాలిటీతో పాటు ని యోజకవర్గంలోని పలు గ్రామాలు, కాలనీల్లో సమస్యలను పరిష్కరిం చేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అధికారులకు సూచించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల నేపథ్యంలో పరిటాలశ్రీరామ్ ఆదివారం ధర్మవరంలోని తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్‌తోను, తాడిమర్రి, బ త్తలపల్లి, ముదిగుబ్బ, ధర్మవరం ఎంపీడీఓల తో వేర్వేరుగా సమావే శాలను నిర్వహించారు.
అధికారులతో పరిటాల శ్రీరామ్
ధర్మవరం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీతో పాటు ని యోజకవర్గంలోని పలు గ్రామాలు, కాలనీల్లో సమస్యలను పరిష్కరిం చేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అధికారులకు సూచించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల నేపథ్యంలో పరిటాలశ్రీరామ్ ఆదివారం ధర్మవరంలోని తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్‌తోను, తాడిమర్రి, బ త్తలపల్లి, ముదిగుబ్బ, ధర్మవరం ఎంపీడీఓల తో వేర్వేరుగా సమావే శాన్ని నిర్వహించారు. మండలానికి ఎంత నిధులు రావచ్చు, వాటితో ఎలాంటి పనులు చేయబోతున్నారనే అంశాలపై చర్చించారు. ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా ‘మీ సమస్య- మా బాధ్యత’ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదుపై చర్చించారు. ఇం దులో గ్రామాల్లో తాగునీరు, శ్మశాన వాటికలు, డ్రైనేజీ, రోడ్ల వంటివి ఉ న్నాయన్నారు. ముందుగా వాటికి ప్రాధాన్యమిస్తూ ప్రణాళిక రూపొం దించాలని, ప్రాధాన్యత వారీగా పనులు చేపట్టాలన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో సమస్యలు తెలిపారని,
వాటిపై దృష్టి సారించాలని క మిషనర్‌తో అన్నారు. ముందుగా గ్రామాలు, కాలనీలను ఒకసారి పరి శీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సి పల్ కమిషనర్ సాయికృష్ణ, డీఈ వీరేశ, ఎంపీడీఓలు, టీడీపీ ముఖ్య నాయకులు కమతంకాటమయ్య, చింతలపల్లి మహేశచౌదరి, పరిశే సుధాకర్, పురుషోత్తంగౌడ్, నాగూర్‌హుస్సేన, భీమనేని ప్రసాద్‌నాయు డు, మాధవరెడ్డి, రాళ్లపల్లి షరీఫ్, అంబటి సనత, కొత్తపేట ఆది, జింకా పురుషోత్తం, అస్లాం, విజయసారఽథి తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
పేదలకు విద్య, వైద్యం చేరువచేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఇద్దరికి మంజూరైన రూ.89 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన పంపిణీచేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వానికి, పరిటాలశ్రీరామ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....