ROAD: అధ్వానంగా రహదారి
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:26 AM
పట్టణం నుంచి మామిళ్లప ల్లికి వెళ్లే రహదారి గుంతలు ఏర్పడి అధ్వానంగా తయారైంది. పోతుకుంట బృందావన కాలనీ పోలీస్‌గెస్ట్ హౌస్ వద్ద నుంచి ధర్మవరంలోకి రహదారి అంతా దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కాలంలో ఈ రహదారిపై ప్యాచ వర్కులు చేసినా నెలలు గడవకముందే రహదారి అంతా ఛిద్ర మవు తోందని ఆ రహదారి గుండా ప్రయాణించే గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.
ధర్మవరం రూరల్, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): పట్టణం నుంచి మామిళ్లప ల్లికి వెళ్లే రహదారి గుంతలు ఏర్పడి అధ్వానంగా తయారైంది. పోతుకుంట బృందావన కాలనీ పోలీస్‌గెస్ట్ హౌస్ వద్ద నుంచి ధర్మవరంలోకి రహదారి అంతా దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కాలంలో ఈ రహదారిపై ప్యాచ వర్కులు చేసినా నెలలు గడవకముందే రహదారి అంతా ఛిద్ర మవు తోందని ఆ రహదారి గుండా ప్రయాణించే గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఇంత ఆధ్వానంగా ఉంటే ఎలా ప్రయాణం చేసేది? అంటూ ప్రశ్నిస్తున్నారు. నిత్యం ఈ రహదారి గుండా ఆటోలు, ద్విచక్రవాహనాలతో పాటు పలు వాహనాలు మామిళ్లపల్లి వద్ద జాతీయరహదారిలోకి వెళుతుం టాయి. ఈ గుంతలరోడ్డులో ద్విచక్రవాహనదారులు అదుపు తప్పి గాయాల పాలవుతున్నారు. రోడ్డు ఆధ్వానంగా ఉండటం పట్ల పలువురు వాహన దారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రహదారిలో ఉన్న గుంతలను పూడ్చివేసి ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చేయాలని వాహనదారులు, గ్రామస్థులు కోరుతున్నారు.