HOSPITAL: అరకొర వైద్యం!
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:36 PM
పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అరకొర సౌకర్యాలతో సరైన వైద్య సేవలు అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. వంద పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలోని ప్రధాన విభాగాల్లో వైద్య పరికరాలు లేవు. దీంతో మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రులకు రెఫర్ చేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. పలువిభాగాల్లో వైద్యుల కొరత కూడా వేధిస్తోంది.
ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాల కొరత
ధర్మవరంరూరల్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అరకొర సౌకర్యాలతో సరైన వైద్య సేవలు అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. వంద పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలోని ప్రధాన విభాగాల్లో వైద్య పరికరాలు లేవు. దీంతో మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రులకు రెఫర్ చేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. పలువిభాగాల్లో వైద్యుల కొరత కూడా వేధిస్తోంది. ఇటీవల జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో వైద్యులు, కమిటీ బృంద సభ్యులు ఆస్పత్రిలోని పలువిభాగాలు, వార్డులను పరిశీలించారు. అందులో ప్రధానంగా పరికరాలు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సీఎ్‌సఆర్ ఫండ్‌తో రూ.63.75లక్షల విలువైన పరికరాల కోనుగోలుకు ఆమోదం తెలిపారు. పలువిభాగాలకు సంబంధించి పరికరాల కోసం నివేదికలు తయారు చేశారు. ఐసీయూలో మంచాలు, బెడ్లు, అపరేషన థియేటర్‌లో పరికరాలు, ఎముకల, జనరల్ సర్జరీలో ఉపయోగించే పరికరాలు, ఈఎనటీ సంబంధింత పరికరాలు,
ఆపరేషన లైట్లు, పరికరాలు, ప్రసవం కోసం వాడే టేబుళ్లు, స్ట్రక్చర్-4, ట్రాగన్స చైర్స్ కోనుగోలు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఈ పరికరాలన్నీ సమకూరిస్తే ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని వైద్య సిబ్బంది పేర్కొన్నారు.
అన్ని సదుపాయాలు ఉండాలి
- వెంకటేష్, కుణుతూరు, ధర్మవరం మండలం
ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని సదుపాయాలతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి. సీజనల్ వ్యాధుల కాలం వస్తే ఆస్పత్రి రోగులతో నిండిపోతుంది. గతంలో ఒకసారి నేనుకూడా సీజనల్ జ్వరంతో బాధపడుతూ అనంతపురం వెళ్లి చికిత్స చేయించుకున్నా. ఇక్కడే అన్ని సదుపాయాలు ఉంటే అనంతపురం వెళ్లే అవసరం ఉండదు.
ప్రతిపాదనలు సిద్ధం చేశాం
- తిప్పేంద్రనాయక్, ఆస్పత్రి సూపరింటెండెంట్, ధర్మవరం
ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మౌలికసదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించాం. పలువిభాగాల్లో ఆధునాతన పరికరాల కోసం చర్చించాం. సీఎ్‌సఆర్ ఫండ్ కింద రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....