TURN : ప్రమాదకరంగా మలుపు
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:43 PM
మండలంలోని ముచ్చు రామి గ్రామం నుంచి రేగాటిపల్లికి వెళ్లే రహదారిలో ఓ మలుపు ప్రమాద కరంగా మారింది. ఆ మలుపు వద్ద కంపచెట్లు ఏపుగా పెరగడంతో రోడ్డు కనిపించక తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయా గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు రోడ్డు ప్రమాదాల బారిన పడి గాయాలపాలయ్యారు.
ధర్మవరం రూరల్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని ముచ్చు రామి గ్రామం నుంచి రేగాటిపల్లికి వెళ్లే రహదారిలో ఓ మలుపు ప్రమాద కరంగా మారింది. ఆ మలుపు వద్ద కంపచెట్లు ఏపుగా పెరగడంతో రోడ్డు కనిపించక తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయా గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలువురు రోడ్డు ప్రమాదాల బారిన పడి గాయాలపాలయ్యారు. ప్రధానంగా ఈ రహదారి గుండా ధర్మవరం నుంచి సీతారంపల్లి క్రాస్, జాతీయ రహదారికి వాహనాలు వెళుతుంటాయి. ఎటువంటి సూచికబోర్డులు గానీ, డివైడర్లు లేకపోవడం తో మలుపు వద్ద ద్విచక్రవాహనాలు అదుపుకాక పలువురు కిందపడి మృత్యువాతపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మలుపు వద్ద కంపచెట్లు తొలగించి, మలుపు కనిపించేలా సూచిక బోర్డులు, డివైడర్లును ఏర్పాటుచేయాలని వాహనదారులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....