Home » Devotional
ఆ రాశి వారికి ఈ వారం లావాదేవీలతో తీరిక ఉండదు... అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. వేడుకను ఆర్భాటంగా చేస్తారుని, పరిస్థితులు చక్కబడతాయని తెలుపుతున్నారు. అంతేగాక.. ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుందని, ఖర్చులు విపరీతంగా ఉంటాయని, చేస్తున్న పనులపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు.
ధూప, దీప, నైవేద్యాల కోసం 73 దేవస్థానాలకి నెలకి రూ.10వేలు చొప్పున సహాయం అందిస్తున్నామని ఏపీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. దాతలు దేవస్థానాలు నిర్మించేటప్పుడు దేవాదాయ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఆదేశించారు.
కార్తీక మాసం శనివారాలు శివారాధనకు అత్యంత శుభమయమైనవి. ఈ రోజు భక్తితో శివుడిని పూజిస్తే అన్ని కష్టాలు తొలగి, ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్తీక శనివారం ప్రత్యేకంగా ఇలా పూజ చేస్తే శివుని అనుగ్రహం సులభంగా పొందవచ్చు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వీడియోలో చూడండి.
అందం కంటికి కనిపించేది మాత్రమే. కానీ నిజమైన విలువ మనిషి గుణంలో ఉంటుంది. ఈ సూక్తి మనకు ఒక గాఢమైన సందేశం ఇస్తుంది — రూపం కంటే మనసు, స్వభావం, మంచితనం ఎక్కువ ముఖ్యం. దీనిపై గరికపాటి నరసింహారావు సందేశాన్ని కింది వీడియోలో చూడండి.
హిందూ ధర్మంలో కార్తీకమాసం అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ మాసంలో శివపార్వతుల ఆరాధన చేస్తే అశేష పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. శివుడి కృపతో పాటు పార్వతీ దేవి ఆశీర్వాదం పొందాలంటే ఈ నెలలో కొన్ని విశిష్ట పూజలు, నియమాలు పాటించడం చాలా ముఖ్యం.
ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో నిండిన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. కానీ, కొన్నిసార్లు మనం తెలియకనే కొన్ని తప్పులు చేస్తుంటాము, అవే మన జీవితంలో కష్టాలను తెస్తాయి. ఈ వ్యాసంలో మీరు సుఖంగా జీవించాలంటే ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం.
బుధుడు, శనికి మధ్య ప్రత్యేక యోగం కారణంగా కొన్ని రాశులకు ఊహించని ప్రయోజనం కలగనుంది. అలా వారి జీవితంలో కెరీర్ పరంగానే కాక.. ఆర్థికంగా, వ్యక్తిగతంగా మంచి అవకాశాలను తీసుకురానుంది.
కార్తీక మాసం శుక్లపక్షంలో పండుగలు ఉన్నట్లే.. కృష్ణపక్షంలోనూ అనేక పండుగలు ఉన్నాయి. తొలిరోజులకంటే.. కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే 15 రోజులు కూడా విశేషమైనవిగానే చెబుతారు. ఈ రోజుల్లో ముఖ్యంగా దీపారాధన చేయడం, శివకేశవులను పూజించడంతోపాటు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రతిష్ట పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం గతం కంటే చాలా బావుందని భక్తులు చెబుతున్నారని పేర్కొన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
కార్తీక పౌర్ణమి నాడు దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఈ వస్తువులు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అపారమైన సంపద, శ్రేయస్సును అనుగ్రహిస్తుంది.