Devotional: ఆ రాశి వారికి ఈ వారం ఖర్చులు విపరీతం..
ABN , Publish Date - Jan 18 , 2026 | 08:23 AM
ఆ రాశి వారికి ఈ వారం ఖర్చులు విపరీతంగా ఉంటాయని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. మాటతీరుతో ఆకట్టుకుంటారని, కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. మొత్తంగా ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...
అనుగ్రహం
18 - 24 జనవరి 2026
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
గ్రహానుకూలత ఉంది. తల పెట్టిన కార్యం సఫలమవుతుంది. మీ సామర్థ్యంపై ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవు తుంది. పనులు త్వరితగతిన సాగుతాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వివాహయత్నాలుతీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను నమ్మ వద్దు. అందరితోనూ మితంగా మాట్లాడండి.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
అన్ని రంగాల వారికీ బాగుంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చు తాయి. నిర్దిష్ట ప్రణాళికలతో అడుగు ముందు కేస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగు తాయి. అర్ధాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. పెట్టుబడులపై దృష్టి పెడతారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయం తగదు. ఆప్తులను సంప్రదించండి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
అనుకూలతలు నెలకొంటాయి. మాట నిలబెట్టుకుంటారు. అందరిలో గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పనులు ఒక పట్టాన సాగవు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆత్మీయు లతో తరచూ సంభాషిస్తారు. పత్రాల రెన్యు వల్‌లో జాప్యం తగదు. పొదుపు పథకాలు లాభిస్తాయి. ప్రయాణం కలిసివస్తుంది.సన్మాన, సంస్మరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. ఆత్మీయులతో సంభా షణ ఉత్సాహం కలిగిస్తుంది. వివాహ యత్నాలు సాగిస్తారు. ఓర్పుతో మరోసారి యత్నించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. ఆంతరంగిక విష యాలు వెల్లడించవద్దు. మితంగా సంభాషిం చండి. కొత్త సమాచారం తెలుసుకుంటారు.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
అన్నిరంగాల వారికీ అనుకూ లమే. అనుకున్న కార్యం సాధిస్తారు. మీ సమర్థతపైౖ నమ్మకం కలుగుతుంది. కలుపు గోలుగా వ్యవహరిస్తారు. పనులు సానుకూల మవుతాయి. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కొంటారు. పెద్దల చొరవతో వివాదం సద్దుమణుగుతుంది. నోటీసులు అందుకుంటారు. ఖర్చులు అధికం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. కొత్తయత్నాలు చేపడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ఖర్చులు తగ్గించు కుంటారు. ధనసహాయం తగదు. మీ ఇష్టాయి ష్టాలను సౌమ్యంగా తెలియజేయండి. ఎవరినీ నొప్పించవద్దు. చిన్ననాటి ేస్నహితులను కలు సుకుంటారు. గత సంఘటనలు అనుభూతిని స్తాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. ఖర్చులు సామాన్యం. పనులు, కార్యక్రమాలుస్వయంగా చూసుకోండి. అప్రమత్తంగా మెలగవలసిన సమయం. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆత్మీయు లతో సంభాషిస్తుంటారు. ఒక విషయం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులను సంప్రదిస్తారు. పెద్దల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
సర్వత్రా అనుకూలం. స్థిరచ రాస్తి ధనం అందుతుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ ఫైనాన్సులో మదుపు తగదు. కొత్తపనులు చేపడతారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా పడతాయి. వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వివా హయత్నం ఫలిస్తుంది. పత్రాలు అందుకుం టారు. వివాదాలు పరిష్కారమవుతాయి.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
తలపెట్టిన కార్యం సఫల మవుతుంది. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఖర్చులు తగ్గిం చుకుంటారు. పెద్దమొత్తం సాయం తగదు. అర్థాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్త యత్నాలు చేపడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు సాయం కోర వద్దు. స్వయంకృషితోనే లక్ష్యాన్ని సాధిస్తారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. అనవసర విష యాల్లో జోక్యం తగదు. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త యత్నాలు మొదలెడతారు. ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. నోటీసులు అందు కుంటారు. పెద్దలను సంప్రదిస్తారు. ప్రయా ణం చేయవలసి వస్తుంది.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. పురస్కా రాలు అందుకుంటారు. ఉత్సాహంగా ముం దుకు సాగుతారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. చాటుమాటు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్ద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఊహిం చిన ఖర్చులే ఉంటాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అవిశ్రాంతగా శ్రమిస్తారు. ఆశించిన అవకాశం చేజారిపోతుంది. ఆత్మ స్థైర్యంతో మరోసారి యత్నించండి. నేడు అను కూలించనిది రేపు ఫలించవచ్చు. సహాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఉల్లాసంగా గడుపుతారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ముఖ్యుల కలయిక వీలుపడదు. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. కొంతమొత్తం ధనం అందు తుంది. అనవసర జోక్యం తగదు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి, వెండి ధరల్లో కొనసాగుతున్న పెరుగుదల! నేటి రేట్స్ ఇవీ..
శబరిమల బంగారం చోరీ కేసు.. సిట్‌కు చేరిన శాస్త్రీయ నివేదిక
Read Latest Telangana News and National News