Devotional: ఆ రాశి వారికి ఈ వారం అంతా లాభదాయకమే...
ABN , Publish Date - Jan 11 , 2026 | 07:37 AM
ఆ రాశి వారికి ఈ వారం అంతా లాభదాయకమేనని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని, ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయని తెలుపుతున్నారు. మొత్తంగా ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
అనుగ్రహం
11 - 17 జనవరి 2026
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆత్మీయులను వేడుకలు, విందుకు ఆహ్వానిస్తారు. పరిచయాలు బలపడ తాయి. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. సన్నిహితుల సలహా పాటిం చండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. మానసికంగా స్థిమితపడ తారు. కొత్తప్రదేశం, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
అన్నివిధాల యోగదాయకం. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పరస్పరం కానుకలిచ్చి పుచ్చుకుంటారు. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ప్రయాణంలో అవస్థలెదుర్కొంటారు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
తలపెట్టిన కార్యం సఫలమ వుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ధనానికి ఇబ్బంది ఉండదు. అయినవారితో కాలక్షేపం చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. ముఖ్యుల కలయిక వీలు పడదు. పత్రాల రెన్యువల్‌లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఆత్మీయులకు ముఖ్యసమాచారం అందిస్తారు.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగి స్తుంది. కొత్త పనులు చేపడతారు. అవకాశా లను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమా నాలు, అపోహలకు తావివ్వవద్దు. మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు తప్పుపడతారు. పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణుగుతుంది. పిల్లలకు శుభపరిణామా లున్నాయి. పత్రాలు అందుకుంటారు.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
వ్యవహారాలతో తీరిక ఉండదు. పనిభారం, విశ్రాంతిలోపం. ఖర్చులు అంచ నాలను మించుతాయి. పొదుపు ధనం గ్రహి స్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదు రవుతాయి. తెగిపోయిన బంధుత్వాలు బల పడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
గ్రహస్థితి బాగుంది. తల పెట్టిన కార్యం సఫలమవుతుంది. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. కొత్తయత్నాలు చేపడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూరిచేస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. లక్ష్యం సాధిస్తారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపిం చవు. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఎవరి పైనా భారం వేయొద్దు. కొత్తవ్యక్తులతోజాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. బంధువులను విందుకు ఆహ్వానిస్తారు. నగదు, కీలక పత్రాలు జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
లావాదేవీలు ఫలిస్తాయి. ధన లాభం ఉంది. వ్యూహాత్మకంగా అడుగు లేస్తారు. ఒక సమాచారం సంతోషం కలిగి స్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. యత్నాలకు అయినవారి ప్రోత్సాహం ఉం టుంది. అందరితోనూ మితంగా సంభాషించండి. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వ వద్దు. కీలకపత్రాలు సమయానికి కనిపించవు. చిన్న విషయానికే అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. కొత్తసమస్య ఎదురయ్యే సూచనలున్నాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశావహదృక్పథంతో మెలగండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. ఇతరులపై భారం వేయొద్దు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుం టుంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎవరినీ అతిగా నమ్మవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. పత్రాల రెన్యువల్‌లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తుంటారు. వేడుకకు ఆహ్వానం అందుకుంటారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యవహారాల్లో తగిన నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టు పక్కల వారిని గమనించండి. పనులు మంద కొడిగా సాగుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. తెగి పోయిన బంధుత్వాలు, బలపడతాయి.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి. ధనం మితంగా ఖర్చుచేయండి. ఆర్బాటాలు, భేషజాలకు పోవద్దు. పరిస్థితు లకు అనుగుణంగా మెలగండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. తరచూ సన్నిహితులతో సంభాషిస్తుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు షాక్.. ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News