Home » Delhi
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుళ్ల ఘటనకు సంబంధించి నిందితుడు ముజామ్మిల్ కీలక విషయాన్ని బయటపెట్టాడు. నిజానికి తాము దీపావళికే ప్లాన్ చేశామని, కానీ అమలు చేయడంలో విఫలమైనట్టు అతడు విచారణలో చెప్పాడు.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుళ్లు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. పేలుళ్లకు రెండు రోజుల ముందు గుజరాత్‌లో యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మహ్మద్ మోహియుద్దిన్ ఉండటం చర్చనీయాంశమైంది.
పేలుడులో గాయపడి లోక్‌నాయక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం రేఖాగుప్తా మంగళవారంనాడు పరామర్శించారు. వారికి అన్నివిధాలా అండగా ఉంటామని తెలిపారు.
భారీ పేలుడు నేపథ్యంలో ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారంనాడు తన నివాసంలో రెండోసారి అత్యున్నత భద్రతా స్థాయి సమావేశం నిర్వహించారు.
దేశ రాజధాని ఢిల్లీ.. భారీ పేలుడుతో దద్దరిల్లింది! దేశంలోని అత్యంత హై ప్రొఫైల్ ప్రాంతాల్లో ఒకటి.. పంద్రాగస్టునాడు దేశ ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించే ఎర్రకోటకు సమీపంలో మెట్రోస్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం దాదాపు.....
ఢిల్లీ పేలుళ్ల ఘటనలో ఆత్మాహుతి దాడిగా పరిగణిస్తున్న దర్యాప్తు బృందం.. సంబంధిత వ్యక్తిని గుర్తించి, ఫొటోను విడుదల చేసింది. సోమవారం దేశ రాజధానిలో తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. మరో 20 మందికి గాయాలయ్యాయి.
ఢిల్లీ ఘటనలో మృతి చెందిన వారికి టీమిండియా కోచ్, మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ సంతాపం తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికా పోస్ట్ పెట్టాడు. ఢిల్లీలో జరిగిన పేలుడు కారణంగా ప్రాణనష్టం సంభవించడం బాధాకరమని అన్నాడు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని గంభీర్ తన ‘ఎక్స్’ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.
దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట పరిధిలో చోటు చేసుకున్న పేలుడు ఘటనకు సంబంధించి కీలక అప్‌డేట్స్ వెలుగులోకి వస్తున్నాయి. పేలుడు ఘటనకు ముందు కారుకు సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియోలు బయటికి రావడంతో వైరల్ అవుతున్నాయి. సమారు 3 గంటల పాటు కారును అక్కడే పార్క్ చేశారని, నిందితులు కూడా అందులోనే కూర్చున్నట్లు చెబుతున్నారు.
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో ఉపయోగించిన కారు గురుగ్రామ్ ఆర్టీవో వద్ద రిజిస్ట్రర్ చేశారని కేంద్ర ఇంటెలిజన్స్ అధికారులు వెల్లడించారు. ఈ పేలుడు ఘటనతో కేంద్ర ఇంటెలిజన్స్ అధికారులు అలర్ట్ అయ్యారు.
ఢిల్లీ సీపీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌చార్జితో మాట్లాడాననీ, వారిరువురూ ఘటనా స్థలి వద్ద ఉన్నారని అమిత్‌షా తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరుపుతామని చెప్పారు.