Terror Threat: గణతంత్ర దినోత్సవం వేళ హై అలర్ట్.. ఉగ్ర ముప్పుపై నిఘావర్గాల హెచ్చరిక
ABN , Publish Date - Jan 17 , 2026 | 03:23 PM
గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న వేళ.. దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాల్లో భారీఎత్తున ఉగ్ర ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి.
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం-2026 (Republic Day-2026) సందర్భంగా అన్ని రాష్ట్రాలకు భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరిగే అవకాశముందని నిఘా వర్గాలు(Intelligence Agencies) హెచ్చరించాయి. ఖలిస్థానీ, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర గ్రూపులు ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, ముంబై, హైదరాబాద్ సహా పలు ప్రధాన నగరాల్లో దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) హెచ్చరించింది.
ఆయా నగరాల్లోని రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఉగ్రమూకలు గగనతలం నుంచి డ్రోన్ల ద్వారా దాడులు జరిపే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ముఖ్య ప్రాంతాల్లో మాక్‌డ్రిల్ నిర్వహిస్తూ నిఘా పెంచారు అధికారులు. ఇప్పటికే సుమారు 50,000 మందికి పైగా పోలీసులు, 65 కంపెనీల పారామిలిటరీ దళాలు ఢిల్లీలో మోహరించారు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల భద్రతా బలగాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
నా బంగ్లా కూల్చిన వాళ్లను ప్రజలే సాగనంపారు.. ఠాక్రేలపై కంగన విసుర్లు
10 మంది సభ్యులతో విజయ్ ప్రచార కమిటీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి