సంక్రాంతి రోజు గోసేవలో పీఎం మోదీ..
ABN, Publish Date - Jan 15 , 2026 | 01:52 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోసేవలో పాల్గొన్నారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఆవులకు పచ్చగడ్డి తినిపించారు పీఎం.
న్యూఢిల్లీ, జనవరి 15: సంక్రాంతి పండుగ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గోసేవలో పాల్గొన్నారు. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ఆవులకు పచ్చగడ్డి తినిపిస్తూ వాటితో ప్రేమగా గడిపారు. భారతీయ సంస్కృతిలో గోవులను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. పండుగ పూట ప్రధాని గోసేవ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. 'ఈ పండుగకు ప్రకృతితో ఉన్న ప్రత్యేక అనుబంధం అందరికీ తెలిసిందే. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో సుఖ శాంతులని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. మీ కలలన్నీ సాకారం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా' అంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ సంక్రాంతి విషెస్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నిస్వార్థ సేవ చేసే సైనికులకు ఆర్మీ డే శుభాకాంక్షలు: ప్రధాని మోదీ విషెస్..
నౌకాయాన రంగంలో భారత్ అరుదైన ఘనత
Read Latest National News And Telugu News
Updated at - Jan 15 , 2026 | 02:08 PM