Home » Delhi
అల్-ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిఖీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సిద్ధిఖీని ఈడీ అరెస్ట్ చేసింది. మంగళవారం అరెస్ట్ చేసిన సిద్ధిఖీని ఈ రోజు సాకేత్ కోర్టులో ఈడీ హాజరు పరిచింది.
ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేల్చడానికి వారం రోజుల ముందు నబీ కశ్మీర్‌లోని పుల్వామాలో తన ఇంటికి వెళ్లి సోదరుడు జహూర్ ఇలాహాకి ఆ వీడియో ఉన్న మొబైల్ ఫోన్ ఇచ్చాడు. నబీ స్నేహితులు అరెస్ట్ అయిన తర్వాత అతడి సోదరుడు ఆ ఫోన్‌ను ఓ చెరువులోకి విసిరేశాడు
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాపై దాడికి నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలు చేశామని మంద కృష్ణ మాదిగ అన్నారు. ఈ విషయంపై రాష్ట్రపతిని కలుస్తామన్నారు.
ముంబై పోలీసుల సాయం తీసుకుని దర్యాప్తు సంస్థలు ఆ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. నిర్బంధంలోకి తీసుకున్న అనుమానితులను తదుపరి విచారణ కోసం ఢిల్లీకి తరలించినట్టు తెలుస్తోంది.
వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌లో ప్రమేయమున్న నలుగురు డాక్టర్లు ముజామిల్ షకీల్, ఉమర్ ఉన్ నబి, సహీనా సయీద్, అదీల్ హమ్ రాడార్‌లు వంట పేరుతో బాంబులు, దాడుల గురించి సంభాషించుకున్నారు.
ఢిల్లీ కారు బాంబు దాడి కేసుకు సంబంధించి మరో వ్యక్తిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
నవంబర్ 10వ తేదీన ఉమర్ నబీ అనే వ్యక్తి ఎర్రకోట దగ్గర ఐ20 కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 13 మంది చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
ఢిల్లీలో ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈలకు సంబంధించి కేంద్రమంత్రి జితిన్ రామ్ మాంజీతో చర్చించారు. ఏపీలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరారు మంత్రి కొండపల్లి.
అమీర్ రషీద్ అలీని కోర్టుకు హాజరుపరిచే సమయంలో మీడియాను అనుమతించలేదు. కోర్టు కాంప్లెక్స్ చుట్టూ ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మోహరించారు. అల్లర్ల వ్యతిరేక టీమ్‌నూ సిద్ధం చేశారు.
ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ముగ్గురు వైద్యులను అరెస్టు చేయగా.. తాజాగా హర్యానాకు చెందిన మరో వైద్యురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.