Home » Delhi
బీజేపీతో ఒప్పందంలో భాగంగానే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బయట ఉన్నారని ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిల మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీ పోతే ఎవర్ని కలిసేది.. ఎవరి కారులో తిరిగేది బయటకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.
నక్సల్స్‌పై కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. నక్సల్స్ మూమెంట్ వీక్ అయిపోయిందని విమర్శించారు. నక్సల్స్‌లో ఎవరికి వాళ్లు తమ సిద్ధాంతాలు చెబుతారని అన్నారు. కమ్యూనిస్టుల మధ్యే ఎన్నో విబేధాలు ఉన్నాయని ఆరోపించారు వెంకయ్య నాయుడు.
ఢిల్లీలో వింటర్ ఎఫెక్ట్ మొదలైంది. ఒకవైపు వాయు కాలుష్యం, మరోవైపు శీతాకాలం కావడంతో సర్కారు నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు తీసుకొచ్చారు.
భారత్ భారీ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్పులకు లోనవుతున్న కాలమది. జాతీయ గుర్తింపు భావన, వలస పాలనపై ప్రతిఘటన పెరుగుతున్న ఆ కాలంలో వందేమాతరం.. మాతృభూమిని బలం, శ్రేయస్సు, దైవత్వానికి ప్రతీకగా మార్చింది.
ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచీ (AQI) ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. తాజాగా శనివారం ఉదయం కూడా గాలి నాణ్యత సూచీ పేలవమైన స్థాయిలో నమోదైంది.
భారత్- చైనా సరిహద్దు ప్రాంతాల్లో సంయుక్తంగా శాంతిని కాపాడేందుకు అంగీకరించారని విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ చర్చల విషయాన్ని తాజాగా భారత ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది.
ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు ఖేక్ర, బురారి మధ్యలో 46.3 కిలోమీటర్ల పొడవు, 7.4 కిలోమీటర్ల వెడల్పులో క్లౌడ్ సీడింగ్ చేశారు. మొదటి రౌండ్‌లో భాగంగా 4 వేల అడుగుల ఎత్తులో ఆరు ప్లెయిర్స్‌ను రిలీజ్ చేశారు.
ఎవ్వరూ ఊహించని విధంగా ఆమె 145 కేజీల డెడ్ లిఫ్ట్‌లో పాల్గొంది. డెడ్ లిఫ్ట్‌తో పాటు 125 కేజీల స్క్వాట్స్, 80 కేజీల బెంచ్ ప్రెస్‌లోనూ పాల్గొంది. 145 కేజీల డెడ్ లిఫ్ట్ విభాగంలో కాంస్య పతకం సాధించింది.
రమేష్‌కు కొన్ని నెలల క్రితం 21 ఏళ్ల అమ్రితతో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గాంధీ విహార్‌లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని సహజీవనం మొదలెట్టారు. ఇద్దరూ ఏకాంతంగా గడిపిన దృశ్యాలను రమేష్ సీక్రెట్‌గా వీడియోలు తీశాడు.
దేశంలో కుక్కల దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి సంఘటనలు నిరంతరం జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేసింది. మన దేశాన్ని విదేశీయులు కించపరిచేలా మాట్లాడటానికి కుక్కల బెడదా కారణమని సుప్రీం సంచలన వ్యాఖ్యలు చేసింది.