Tobacco Products: పొగాకు ఉత్పత్తులపై కొత్త GST.. ఫిబ్రవరి 1 నుంచి వర్తింపు..
ABN , Publish Date - Jan 01 , 2026 | 12:37 PM
ధూమపాన ప్రియులకు, పాన్ మసాలా తినేవారికి బిగ్ షాక్. పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్ను విధానం గురించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం (Central Govt)ఇటీవల పొగాకు (tobacco) ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం (Excise duty), పాన్ మసాలపై సెస్సు విధిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం గురువారం, జనవరి1న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ (Notification) జారీ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లు, పొగాకు, సంబంధిత ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ అమలు కానుంది. గతంలో ఇంది 28 శాతం ఉండేది. బీడీలపై మాత్రం జీఎస్‌టీ రేటు 18 శాతంగా కొనసాగుతోంది. GSTతో పాటు పాన్ మసాలాలపై ‘హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్’ (Health and National Security Cess)కూడా విధించనున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘పాన్ మసాలాలపై ఇప్పటికే 40 శాతం జీఎస్టీ విధిస్తున్న విషయం తెలిసిందే. తయారీ కేంద్రాల ఉత్పత్రి సామర్థ్యాన్ని బట్టి సెస్ చెల్లించవలసి ఉంటుందని అన్నారు. వీటి ద్వారా సమకూరే నిధులు జాతీయ భద్రత బలోపాతానికి, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేస్తాం’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ నోటిఫికేషన్ తో కొన్ని సిగరెట్ కంపెనీలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే అవకాశం ఉందని యాజమాన్య వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మితిమీరి మద్యం తాగినవాళ్లను ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాం.. కర్ణాటక హోం మంత్రి
భారీ ఉగ్రకుట్ర భగ్నం.. 150 కేజీల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం