Watch Video: దేశ రాజధానిలో దారుణం.. షాకింగ్ వీడియో వైరల్..
ABN , Publish Date - Jan 05 , 2026 | 12:47 PM
దేశ రాజధాని ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. జిమ్ కేర్ టేకర్ కొంతమందితో కలిసి ఓ కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. ఇంటి యజమానిని కొట్టి.. అతని భార్యను లైంగికంగా వేధించారు.
న్యూఢిల్లీ, జనవరి 5: దేశ రాజధాని ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. జిమ్ కేర్ టేకర్ కొంతమందితో కలిసి ఓ కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. ఇంటి యజమానిని కొట్టి.. అతని భార్యను లైంగికంగా వేధించడమే కాకుండా.. వారి కొడుకుని బట్టలు విప్పి వీధుల వెంట ఉరికించుకుంటూ కొట్టారు. ఈ ఘటన జనవరి 2వ తేదీన చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలేం జరిగింది.. ఈ గొడవ ఎందుకు జరిగింది.. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్న రాజేష్ గార్గ్.. తన ఇంటి బేస్‌మెంట్‌లో జిమ్ సెంటర్ రన్ చేస్తున్నాడు. ఈ సెంటర్‌కు సతీష్ యాదవ్ అనే వ్యక్తిని కేర్‌టేకర్‌గా పెట్టుకున్నాడు. అయితే, సతీష్ యాదవ్ ఈ జిమ్ సెంటర్‌ను లాగేసుకుందుకు ప్రయత్నిస్తున్నాడంటూ కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జనవరి 2వ తేదీన రాజేష్ గార్గ్, అతని భార్య కలిసి లీక్ అవుతున్న వాటర్ పైప్‌ను పరిశీలించేందుకు ఇంటి సెల్లార్ లోకి వెళ్లారు. ఆ సమయంలో సతీష్ యాదవ్‌కి, రాజేష్‌కి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
దీంతో సతీష్ యాదవ్ తన అనుచరులతో కలిసి రాజేష్, అతని భార్యపై దాడికి పాల్పడ్డారు. రాజేష్ భార్యను లైంగికంగా వేధించారు. వీరి అరుపులు విని కిందకు వచ్చిన రాజేష్ కొడుకును సైతం సతీష్ యాదవ్ గ్యాంగ్ కొట్టింది. అతని బట్టలు విప్పదీసి వీధుల్లో పరుగెత్తించారు. ఈ ఘటనపై రాజేష్ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సతీష్ యాదవ్, అతని అనుచరులపై కంప్లైంట్ ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా సతీష్ యాదవ్, వికాస్ యాదవ్, శుభం యాదవ్, ఓంకార్ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సతీష్‌ను అరెస్ట్ చేయగా.. మిగిలిన వారు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read:
అన్నదాతలకు గుడ్ డేస్.. లాభాల పంట పండిస్తున్న టమోటా
ఆత్మహత్యకు పాల్పడ్డ జూనియర్ డాక్టర్ మృతి
నల్లమల సాగర్‌ను అడ్డుకోండి.. సుప్రీంకోర్టులో టీ సర్కార్ వాదనలు..