Feeding Dhatura Laced Food: తల్లి మాట విన్నాడు.. లడ్డూలు పెట్టి అందర్నీ చంపేశాడు
ABN , Publish Date - Jan 06 , 2026 | 10:58 AM
యష్‌బీర్ తల్లి మాటల్ని సీరియస్‌గా తీసుకున్నాడు. సోమవారం ఉదయం ఉమ్మెత్త గింజల్ని సేకరించాడు. వాటిని మెత్తగా దంచి తినే లడ్డూల్లో కలిపాడు. ఆ లడ్డూలను కుటుంబసభ్యులకు పెట్టాడు.
అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. లడ్డూల్లో విషం పెట్టి కుటుంబం మొత్తాన్ని చంపేశాడు. ఈ సంఘటన ఢిల్లీలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఈస్ట్ ఢిల్లీ, లక్ష్మీనగర్‌కు చెందిన యష్‌బీర్ సింగ్ అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పులు తీర్చే స్థోమత లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. ఇలాంటి సమయంలో ఆరు నెలల క్రితం అతడి తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. దీంతో బాధ్యత మెుత్తం యష్‌బీర్ మీదే పడింది. ఓ వైపు అప్పులు, మరోవైపు కుటుంబం బాధ్యతతో కంటి మీద కునుకులేకుండా పోయింది.
ఇక, చావు తప్ప మరో మార్గం లేదని అనుకున్నాడు. అతడి పేరు మీద ఏకంగా రూ.1.5కోట్ల ఇన్సూరెన్స్ ఉంది. తను చనిపోతే ఆ డబ్బులు కుటుంబానికి వస్తాయని అనుకున్నాడు. పలుమార్లు ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలమయ్యాడు. కుమారుడు తరచుగా ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నిస్తుండటంతో తల్లి తట్టుకోలేకపోయింది. ఓ రోజు అతడ్ని పిలిచి ‘ముందు మమ్మల్ని చంపి, తర్వాత నువ్వు చావు’అని అంది. యష్‌బీర్ తల్లి మాటల్ని సీరియస్‌గా తీసుకున్నాడు. సోమవారం ఉదయం ఉమ్మెత్త గింజల్ని సేకరించాడు.
వాటిని మెత్తగా దంచి తినే లడ్డూల్లో కలిపాడు. ఆ లడ్డూలను తల్లి కవిత (46), చెల్లి మేఘన(24), తమ్ముడు ముకుల్ (14)లకు పెట్టాడు. వాటిని తిని వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తర్వాత ముగ్గుర్నీ మఫ్లర్‌తో గొంతు బిగించి చంపేశాడు. అనంతరం లక్ష్మీనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తాను కుటుంబసభ్యుల్ని చంపేసినట్లు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అతడు చెబుతున్నది నిజమేనా?, కాదా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. మర్డర్లు జరిగిన సమయంలో మష్‌బీర్ భార్య ఇంట్లో లేదు. మరి, ఈ హత్యల్లో యష్‌బీర్ భార్య హస్తం ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. వారు చనిపోవడానికి గల సరైన కారణాల కోసం అన్వేషిస్తున్నారు. ఇక, ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఇవి కూడా చదవండి
జీడిమెట్లలో గంజాయి బ్యాచ్ వీరంగం..
యమధర్మరాజు లీవ్‌లో ఉన్నాడేమో.. ఈ మందు బాబు వీడియో చూడండి..