Share News

Drunk man driving video: యమధర్మరాజు లీవ్‌లో ఉన్నాడేమో.. ఈ మందు బాబు వీడియో చూడండి..

ABN , Publish Date - Jan 06 , 2026 | 10:35 AM

పోలీసులు ఎంతగా తనిఖీలు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నివారించడానికి ప్రయత్నిస్తున్నా కొందరి తీరు మాత్రం మారడం లేదు. మద్యం మత్తులో స్పృహ లేకుండా బైక్ నడుపుతూ కింద పడిపోయిన వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Drunk man driving video: యమధర్మరాజు లీవ్‌లో ఉన్నాడేమో.. ఈ మందు బాబు వీడియో చూడండి..
shocking driving video

మద్యం సేవించి వాహనం నడపడం అనేది చట్టరీత్యా నేరం. మద్యం మత్తులో బైక్ నడపడం వారి ప్రాణాలకే కాదు.. ఎదురుగా వచ్చే వారి ప్రాణాలకు కూడా హానికరం. పోలీసులు ఎంతగా తనిఖీలు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నివారించడానికి ప్రయత్నిస్తున్నా కొందరి తీరు మాత్రం మారడం లేదు. మద్యం మత్తులో స్పృహ లేకుండా బైక్ నడుపుతూ కింద పడిపోయిన వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (drunk driving viral video).


@Deadlykalesh అనే ఎక్స్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో చిత్రీకరించారు. ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి బాగా మద్యం సేవించి స్కూటీని నడుపుతున్నాడు. స్కూటీని కనీసం బ్యాలెన్స్ చేయలేక కొన్నిసార్లు రోడ్డు పక్కకు, మరి కొన్నిసార్లు రోడ్డు మధ్యలోకి వెళ్లాడు. మరికొద్ది దూరం ప్రయాణించిన తర్వాత, రోడ్డు పక్కన ఉన్న పోలీసు బారికేడ్‌ను కూడా ఢీకొట్టాడు. చివరకు పోలీసు అధికారి చూస్తుండగానే, బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డు మీద పడిపోయాడు (reckless driving clip).


ఈ వీడియో చూడడానికి నవ్వు తెప్పించే విధంగా ఉంది కానీ, తేడా వచ్చి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది (shocking driving video). ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను 4.2 లక్షల మందికి పైగా వీక్షించారు. 4 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. యమధర్మరాజు లీవ్‌లో ఉన్నాడేమో, లేకపోతే అతడి ప్రాణాలు పోయి ఉండేవని ఒకరు కామెంట్ చేశారు. స్కూటీ ఆటో పైలట్‌ మోడ్‌లోనూ డ్రైవర్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లోనూ ఉన్నారని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

పసిడి ప్రియులకు అలర్ట్.. మరింత పెరిగిన బంగారం ధర..


వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా సత్యసాయి బాబా భక్తురాలు..

Updated Date - Jan 06 , 2026 | 10:35 AM