Home » Cyber Crime
తాను కూడా సైబర్ క్రైమ్ బాధితుడినే అని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల క్రితం సైబర్ మోసానికి గురయ్యానని ప్రస్తావించారు.
ట్రేడింగ్‌లో భారీ లాభాల ఆశ చూపి ఛార్టెడ్ అకౌంటెంట్‌కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. గండిపేటకు చెందిన సీఏ నరసింహారెడ్డిని సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేసి మోసం చేశారు.
మొబైల్ ఫోన్లకు వచ్చే స్పామ్, మోసపూరిత కాల్స్‌ను అరికట్టేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మరో కీలక చర్య తీసుకుంది.
వృద్ధులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారని.. అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ సూచించారు.19 నెలల్లో సీనియర్ సిటిజన్ల నుంచి రూ.102.02 కోట్లను కేటుగాళ్లు కాజేశారని పేర్కొన్నారు.
అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి.. జాగ్రత్త అని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వెనుక సైబర్ మోసం ఉందని వ్యాఖ్యానించారు.
మచిలీపట్నంలో సైబర్ కేటుగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఢిల్లీ పోలీసులమంటూ వృద్ధురాలికి వాట్సాప్ కాల్ చేశారు. వృద్ధురాలి అకౌంట్ నుంచి రూ.1.43కోట్లు మాయం చేశారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్‌పై ఎక్స్‌లో గుర్తుతెలియని వ్యక్తి అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్‌ను సోషల్ మీడియా వేదికగా తీవ్ర పదజాలంతో దూషించాడు.
ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధురాలిని దారుణంగా మోసం చేశారు. ఆమె నుంచి ఏకంగా 16 లక్షల రూపాయలు దోచేశారు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగు చూసింది.
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ ట్రెండ్‌ను మారుస్తున్నారు. మొబైల్ నంబర్లను హ్యాక్ చేసి.. ఆ నంబర్ నుంచి తెలిసినవారికి, వాట్సాప్ గ్రూప్‌లకు లింకులు పంపించి పెట్టుబడులు పెట్టండంటూ పోస్టులు పెడుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికలపై అభ్యంతరకర, మార్ఫింగ్ చేసిన వీడియోలు, చిత్రాల ప్రచారానికి సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.