Cybercrime officials: శుభాకాంక్షల పేరుతో మోసాలకు పాల్పడతారు.. ఆ లింక్‌లు తెరవద్దు
ABN , Publish Date - Jan 01 , 2026 | 08:36 AM
కొత్త సంవత్సరాన్ని పురష్కరించుకొని సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో మోసాలకు పాల్పడే అదకాశం ఉందని పోలీసులు సూచిస్తున్నారు. అయితే... ప్రధానంగా శుభాకాంక్షల పేరుతో వచ్చే లింకులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సూచిస్తున్నారు.
హైదరాబాద్ సిటీ: నూతన ఏడాది వేడుకల సందర్భంగా కొత్త నంబర్ల నుంచి వచ్చే శుభాకాంక్షలు, ఆఫర్లు, గిఫ్ట్‌ల పేరుతో వచ్చే లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో తెరవవద్దని సైబర్ క్రైం అధికారులు(Cybercrime officials) హెచ్చరించారు. ఆఫర్లు, శుభాకాంక్షల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసపూరిత లింక్‌లను ప్రచారం చేస్తున్నారని, మీ స్నేహితుల పేరుతో వచ్చే ఈ సందేశాలను తెరవవద్దని, వాటిపట్ల అప్రమత్తంగా మెలగాలని సూచించారు. ఒకవేళ లింక్ తెరిచినా.. అనుమానాస్పద యాప్ ఇన్‌స్టాల్ అయినా వెంటనే మొబైల్ డాటా, వైఫై సేవలను ఆపివేయాలని అన్నారు.

అలాగే అనుమానాస్పద యాప్‌లను తక్షణం అన్ ఇన్‌స్టాల్ చేయాలని సూచించారు. కొత్తగా వచ్చిన సందేశాలు, లింక్‌లు, పాప్‌అ్‌పలకు సంబంధించి స్ర్కీన్ షాట్‌లు తీసుకోవాలని, వాట్స్‌పతోపాటు ఈమెయిల్, బ్యాంకింగ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల పాస్‌వర్డ్‌లను మార్చాలని సూచించారు. అలాగే, మీ ప్రమేయం లేకుండా లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంక్ / పేమెంట్ యాప్‌కు సమాచారమివ్వడంతో పాటు సైబర్ క్రైం అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి-2' షూటింగ్‌కు డార్లింగ్!
రానూపోనూ టికెట్లు బుక్ చేస్తే 10శాతం రాయితీ
Read Latest Telangana News and National News