Share News

Ibomma Ravi: ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ విచారణ.. కీలక వివరాలు సేకరించిన పోలీసులు..

ABN , Publish Date - Dec 29 , 2025 | 04:35 PM

ఇమంది రవి కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక వివరాలు సేకరించారు. ప్రహ్లాద్‌ వెల్లేల పేరిట రవి పాన్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. గతంలో ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని రవి పోలీసులకు చెప్పాడు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కస్టడీ విచారణ పూర్తయింది.

Ibomma Ravi: ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ విచారణ.. కీలక వివరాలు సేకరించిన పోలీసులు..
Ravi case latest update

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కస్టడీ విచారణ పూర్తయింది. ఇమంది రవి కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక వివరాలు సేకరించారు. ప్రహ్లాద్‌ వెల్లేల పేరిట రవి పాన్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. గతంలో ప్రహ్లాద్ తన రూమ్మేట్ అని రవి పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను పిలిపించి విచారించారు. కస్టడీలో ఉన్న ఇమంది రవి ఎదుటే ప్రహ్లాద్‌ను పోలీసులు ప్రశ్నించారు (Ibomma Ravi custody).


ఇమంది రవి ఎవరో తనకు తెలీదని పోలీసులకు ప్రహ్లాద్ చెప్పాడు. తన పేరుతో రవి పాన్‌, లైసెన్స్‌ తీసుకున్నట్లు తెలిసి షాక్‌కు గురయ్యానని ప్రహ్లాద్ అన్నాడు. ప్రహ్లాద్‌ డాక్యుమెంట్లు ఇమంది రవి దొంగలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, గతంలో చేసిన బ్యాంక్ ట్రాన్సక్షన్లను చూపించి రవిని పోలీసులు ప్రశ్నించారు. లక్షల్లో లావాదేవీలు, డొమైన్ కొనుగోలు, ఐపీ మాస్క్ చేయడం గురించి రవిని పోలీసులు ప్రశ్నించారు (Ibomma Ravi investigation).


సర్వర్ లోడ్ కెపాసిటీ గురించి, ఎవరెవరు ఆ సర్వర్ మైంటైన్ చేస్తున్నారు అని కూడా పోలీసులు ఆరా తీశారు (Ravi case latest update). త్వరలోనే పైరసి రాకెట్‌లో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం కనబడుతోంది. కాగా, రవి 12 రోజుల కస్టడీ ఈ రోజుతో ముగిసింది. రవిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు అనంతరం నాంపల్లి కోర్టులో హజరుపరిచారు.


ఇవి కూడా చదవండి..

బట్టలు లేకుండా తాగుతూ, తూగుతూ.. బ్రిటన్‌లో వెరైటీ న్యూ ఇయర్ పార్టీ..


మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ Qల మధ్యలో O ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Dec 29 , 2025 | 04:49 PM