Cyber Crime Alert: న్యూఇయర్ వేళ ఈ తప్పు చేశారో.. మీ డబ్బు మొత్తం కల్లాసే..
ABN , Publish Date - Dec 29 , 2025 | 05:46 PM
నూతన సంవత్సరం వేళ రాష్ట్ర ప్రజలకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్లు నయా ట్రిక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. న్యూఇయర్ గ్రీటింగ్స్ పేరుతో వాట్సాప్‌ల మోసాలు జరుగుతున్నాయని..
హైదరాబాద్, డిసెంబర్ 29: నూతన సంవత్సరం వేళ రాష్ట్ర ప్రజలకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్లు నయా ట్రిక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. న్యూఇయర్ గ్రీటింగ్స్ పేరుతో వాట్సాప్‌ల మోసాలు జరుగుతున్నాయని సైబర్ సెక్యూరిటీ బ్యూటీ అధికారులు అలర్ట్ చేశారు. ఫేక్ హ్యాపీ న్యూఇయర్ లింక్స్‌పై క్లిక్ చేయొద్దని తెలిపారు. గిఫ్ట్స్, ఆఫర్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారని.. ఆశపడి లింక్స్ క్లిక్ చేస్తే అసలుకే మోసపోయే అవకాశం ఉంది. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డు ఆఫర్ల అంటూ నకిలీ లింక్స్ పంపుతారని.. వాటిని క్లిక్ చేయొద్దని అధికారులు సూచించారు.
ఒకవేళ అలాంటి ఫేక్ లింక్స్ క్లిక్ చేస్తే మొబైల్‌లో మాలిషస్ యాప్ ఇన్‌స్టాల్ అయిపోతుంది. దీంతో మీ మొబైల్స్‌కి వచ్చే ఓటీపీలు, బ్యాంక్ వివరాలు దొంగిలించే ప్రమాదం ఉంది. అలాగే మీ వాట్సాప్ అకౌంట్ కూడా హ్యాక్ అయ్యే అవకాశ ఉంది. నమ్మకమైన కాంటాక్ట్స్ నుంచి ఈ లింక్స్ రావచ్చు.. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాట్సాప్, ఎస్ఎంఎస్ లో వచ్చే ఎలాంటి లింక్స్ క్లిక్ చేయకండి. లింక్ క్లిక్ చేసిన వారు వెంటనే ఇంటర్నెట్ ఆఫ్ చేయాలి. మీ ఫోన్‌లో ఏదైనా అనుమానాస్పద యాప్స్ ఉంటే వెంటనే వాటిని తొలగించేయాలని అని సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్స్ సూచించారు.
Also Read:
Medak: రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. రైతులు ధర్నా..
Pawan Kalyan: కొండగట్టుకు పవన్ కల్యాణ్.. ముహూర్తం ఫిక్స్..
PAN-Aadhaar Link: రెండు రోజులు మాత్రమే ఛాన్స్.. లేదంటే ఇబ్బందులు తప్పవు..