Hyderabad: అమ్మో.. రూ.72 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..
ABN , Publish Date - Jan 02 , 2026 | 07:15 AM
హైదరాబాద్ మహా నగరంలో సైబర్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.72 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరిలు ఇలా ఉన్నాయి.
- స్టాక్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసం
హైదరాబాద్ సిటీ: స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఒకరి నుంచి రూ.72 లక్షలు కాజేశారు. సికింద్రాబాద్(Secunderabad)కు చెందిన వ్యక్తి (59) ఫేస్‌బుక్‌లో స్టాక్ ట్రేడింగ్ ప్రకటన చూసి, వారిని సంప్రదించాడు. ప్రముఖ ట్రేడింగ్ సంస్థ పేరు చెప్పి.. వారు మార్కెటింగ్ మేనేజర్లుగా పరిచయం చేసుకున్నారు. బాధితుడిని ముందుగా ఓ గ్రూపులో చేర్చి స్టాక్ టిప్స్, ఐపీఓ స్ట్రాటజీస్, మార్కెట్ ఒడిదుడుకుల గురించి వివరించి నమ్మకం సాధించారు.

అనంతరం ప్రైమ్ ట్రేడింగ్ గ్రూపులో చేర్పించి కేవైసీ డాక్యుమెంటేషన్ తీసుకున్నారు. ముందుగా చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టించి లాభాలు వచ్చినట్లు చూపారు. విత్‌డ్రా చేసుకునే అవకాశమూ ఇచ్చారు. తర్వాత అధిక లాభాలు వచ్చే ఐపీఓ అలాట్‌మెంట్లు చేస్తున్నామని నమ్మించి భారీ పెట్టుబడి పెట్టించారు. క్రెడిట్ స్కోర్(Credit score) తక్కువగా ఉందని, పెరగాలంటే మరింత డబ్బు పెట్టుబడి పెట్టాలన్నారు.

పెద్ద మొత్తంలో లాభాలు వచ్చినట్లు చూపించి కమీషన్, వీఐపీ మెంబర్‌షిప్ చార్జీల పేరుతో మరి కొంత వసూలు చేశారు. ఇలా పలు దఫాలుగా బాధితుడి నుంచి రూ.72 లక్షలు వసూలు చేశారు. అతడిని గ్రూపు నుంచి తొలగించడంతో పాటు, స్పందించడం మానేశారు. దాంతో ఇదంతా సైబర్ మోసమని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం
Read Latest Telangana News and National News