Cyber Fraud: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన మహిళ.. ఎంత డబ్బు పోగొట్టుకున్నారంటే..
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:11 PM
సైబర్ నేరగాళ్ల మోసానికి ఓ మహిళ లక్షలు పోగొట్టుకుంది. ఓ యాప్‌ను నమ్మి డబ్బులు పెట్టింది మహిళ. చివరకు ఉన్న డబ్బులు స్వాహా అవ్వడంతో పోలీసులను ఆశ్రయించింది.
కామారెడ్డి, డిసెంబర్ 30: సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి అనేక మంది మోసపూతూనే ఉన్నారు. ఎక్కవ డబ్బులు వస్తాయని ఆశపడి సైబర్ కేటుగాళ్ల మాయమాటలు నమ్మి పెద్ద మొత్తంలో డబ్బులు పోగోట్టుకున్న వారు ఎందరో. అవతలి నుంచి డబ్బులు రాకపోగా.. తామ డబ్బులు కూడా పోగొట్టుకుని విలవిలలాడుతున్నారు. చివరికి మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు బాధితులు. తాజాగా కామారెడ్డికి చెందిన ఓ మహిళ సైబర్ మోసాన బారిన పడింది. ఓ యాప్‌నునమ్మి.. డబ్బులు వస్తాయని అత్యాశకపోయి ఉన్న డబ్బులను పోగొట్టుకుంది. వివరాల్లోకి వెళితే...
జిల్లాలోని దోమకొండ మండల కేంద్రానికి చెందిన మహిళ ఓ యాప్‌ను నమ్మింది. అందులో విడతల వారీగా డబ్బులు జమ చేసింది. గత మూడు నెలలుగా యాప్‌లో టాస్క్ చేస్తూ వారు కోరిన విధంగా డబ్బులు పంపింది. తాను పెట్టుబడిన పెట్టిన డబ్బులు కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు జమ అయినట్లు ఆ యాప్‌లో సైబర్ మోసగాళ్లు మహిళకు చూపించారు. దీంతో అదంతా నిజమే అని నమ్మి మరికాస్త డబ్బులను జమ చేసింది.
చివరకు యాప్‌లో ఉన్న డబ్బులను డ్రా చేయాలని చూసింది. కానీ డబ్బులు డ్రా అవ్వలేదు. దీంతో తాను మోసపోయినట్లు మహిళ గ్రహించింది. దాదాపు రూ.1.68 లక్షలను బాధితురాలు మోసపోయింది. ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులను ఆశ్రయించి తాను ఏ విధంగా మోసపోయిందనే విషయాన్ని బాధితురాలు తెలియజేసింది. కేసు నమోదు చేసిన దోమకొండ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
శ్రీనివాస మంగాపురంలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు
దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. భార్య మృతి
Read Latest Telangana News And Telugu News