Vaikuntha Ekadasi: శ్రీనివాస మంగాపురంలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు
ABN , Publish Date - Dec 30 , 2025 | 10:31 AM
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు.
తిరుపతి, డిసెంబర్ 30: ఏపీ వ్యాప్తంగా పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadasi) సందర్భంగా ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. వేకువజామునే భక్తులు ఆలయాలకు తరలివచ్చి ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అటు తిరుమలలోనూ గత అర్ధరాత్రి నుంచే వైకుంఠ ద్వారాలు తెరుచుకోగా.. ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక తిరుపతిలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. అర్ధారాత్రి 1:35 గంటలకు ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో క్యూలైన్లు అన్ని వైపులా భక్తులతో కిక్కిరిసిపోయాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణలతో మార్మోగుతోంది. అదే విధంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి...
ప్రజలకు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
శ్రీవారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి శోభ.. స్వామిని దర్శించుకున్న ప్రముఖులు
Read Latest AP News And Telugu News