Vaikuntha Ekadashi: ప్రజలకు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Dec 30 , 2025 | 08:43 AM
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. తన ఎక్స్ ఖాతా ద్వారా ఆయన ఈ శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి, డిసెంబర్ 30: వైకుంఠ ఏకాదశి పవిత్ర దినాన్ని తెలుగు వారు భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయన్నారు. పవిత్రమైన ఈ పండుగ సందర్భంగా అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏడాదిలో తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమై రోజులు. ఈ రోజులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు పర్వదినాలుగా భావిస్తారు. ఇక తొలి ఏకాదశి ఆషాడ మాసంలో వస్తే.. వైకుంఠ ఏకాదశి పుష్యమాసంలో వస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని చెబుతారు.
అందుకే ఈ వైకుంఠ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ వైకుంఠ ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సమానమని పేర్కొంటారు. క్షీరసాగర మథనం జరిగి హాలాహలంతోపాటు అమృతం ఉద్భవించిందని ఈ రోజేనని పురాణాలు చెబుతాయి. అలాగే పెరియాళ్వార్‌కు శ్రీమహా విష్ణువు గరుడ వాహనంపై దర్శనమిచ్చిందని కూడా ఈ రోజేనని పేర్కొంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ముక్కోటి వేళ.. దేవాలయాలకు పోటెత్తిన భక్త కోటి
వైకుంఠ ఏకాదశి.. ఆ రోజు ఇలా చేస్తే..
For More AP News And Telugu News