Share News

Vaikuntha Ekadashi: ముక్కోటి వేళ.. దేవాలయాలకు పోటెత్తిన భక్త కోటి

ABN , Publish Date - Dec 30 , 2025 | 07:11 AM

తిరుమలలో శ్రీవారి ఆలయంలో సోమవారం అర్థరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అంతకుముందు మూల విరాట్టుకు అర్చకులు ఏకాంతంగా కైంకర్యాలను నిర్వహించారు.

Vaikuntha Ekadashi: ముక్కోటి వేళ.. దేవాలయాలకు పోటెత్తిన భక్త కోటి

అమరావతి, డిసెంబర్ 30: వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని దేవాలయాలన్నీ భక్తుల గోవిందా గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఆర్థరాత్రి నుంచే పలు దేవాలయాల వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. తిరుమలలో శ్రీవారి ఆలయంలో సోమవారం అర్థరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అంతకుముందు మూల విరాట్టుకు అర్చకులు ఏకాంతంగా కైంకర్యాలను నిర్వహించారు. ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం వైకుంఠ ద్వారాలను అర్చకులు తెరిచారు. వేకువజామున 1.30 గంటల నుంచి ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులను శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించారు.


ఉదయం 5.00 గంటలకు సర్వదర్శనం టోకెన్స్ పొందిన భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని కల్పించారు. ఈ రోజు నుంచి జనవరి 8వ తేదీ వరకు భక్తులకు ఈ వైకుంఠ ద్వారా దర్శనాని కల్పించనున్నారు. ఈ వైకంఠ ద్వార దర్శనానికి కోట్లాది మంది భక్తులు తిరుమలకు తరలిరానున్న నేపథ్యంలో.. నేటి నుంచి10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ రోజు నుంచి జనవరి 1వ తేదీ వరకు కేవలం టోకెన్స్ ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నారు. ఈ దర్శనాలకు భారీగా భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ పటిష్టమైన చర్యలు చేపట్టింది.


సింహాచలం..

సింహాచలంలో కొలువదీరిన శ్రీవరాహా లక్ష్మీ నారసింహ స్వామి వారి దేవాలయంలో ఘనంగా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. స్వామి వారిని ఆలయ అనువంశిక ధర్మకర్త వంశీకులు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి గజపతి రాజు తొలి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు, భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు దంపతులు దర్శించుకున్నారు.


ఉదయం 5:30 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని భక్తులు దర్శించుకొంటున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహగిరిని విద్యుత్ దీప కాంతులతో పచ్చి పువ్వులతో సుందరంగా అలంకరించారు. వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారి దర్శనం చేసుకోవడం అత్యంత పుణ్యఫలం అని, సమస్త పాపాలు నశించి, మోక్షం లభిస్తుందని భక్తుల గట్టిగా నమ్ముతారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు.


ద్వారక తిరుమలలో..

ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. రూ. 100, రూ. 200, రూ.500 టిక్కెట్‌పై ప్రత్యేక దర్శనం క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. ఇక వీఐపీలు, వృద్ధులు, గోవింద స్వాములకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ క్యూలైన్లలో తోపులాటలు జరగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు ఎటువంటి సమస్య కలగకుండా.. దేవస్థానం అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.


గుడివాడలో..

కృష్ణాజిల్లా గుడివాడలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి. స్థానికంగా ప్రసిద్ధి గాంచిన శ్రీవెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉత్తర ద్వారంలో స్వామి వారు దర్శనమిస్తున్నారు. ఉత్తర ద్వారా దర్శనాన్ని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర రావు ప్రారంభించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైకుంఠ ఏకాదశి.. ఆ రోజు ఇలా చేస్తే..

పుష్యమాసంలో ఇలా చేస్తే కష్టాలు తొలుగుతాయి..!

For More Devotional News And Telugu News

Updated Date - Dec 30 , 2025 | 10:14 AM