Share News

Pushya Masam: పుష్యమాసంలో ఇలా చేస్తే కష్టాలు తొలుగుతాయి..!

ABN , Publish Date - Dec 26 , 2025 | 10:54 AM

శ్రావణ మాసం మహాలక్ష్మీ, కార్తీక మాసం శివుడు, మార్గశిర మాసం విష్ణువు ఎలాగో ఈ పుష్య మాసంలో శనిదేవుడిని పూజించాలని పురాణాలు చెబుతున్నాయి.

Pushya Masam: పుష్యమాసంలో ఇలా చేస్తే కష్టాలు తొలుగుతాయి..!

పుష్యమాసం ప్రారంభమైంది. ఈ మాసంలో నెల పడతారు. కావున కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో శనిదేవుడిని ఆరాధిస్తే విశేష ఫలితాలు వస్తాయని అంటారు. శ్రావణ మాసం మహాలక్ష్మీ, కార్తీక మాసం శివుడు, మార్గశిర మాసం విష్ణువు ఎలాగో ఈ పుష్య మాసంలో శనిదేవుడిని పూజించాలని పురాణాలు చెబుతున్నాయి. మరి ముఖ్యంగా ఏళ్లనాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి. శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తే ఆ ప్రభావం తగ్గుతుంది. అలాగే ఈ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం చేసి.. నువ్వులు దానంగా ఇస్తే మంచిది. శనిదేవుడికి నువ్వులతోపాటు బెల్లం ప్రీతిపాత్రమని చెబుతారు.


శని భగవానుడు ధర్మం, న్యాయం, సత్యంలను పరిరక్షిస్తుంటాడని పురాణాలు చెబుతున్నాయి. కోర్టు వివాదాల్లో బాధపడే వారు ఈ పుష్య మాసంలో శని దేవుడిని ఆరాధిస్తే శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయని అంటారు. ఈ నెల రోజులు శనిదేవునికి నువ్వులు, బెల్లం నైవేద్యంగా సమర్పించి.. వాటిని స్వీకరిస్తే మంచి ఫలితం ఉంటుంది.


ఇక ఈ మాసంలో శని భగవానుడితో పాటు పుష్యమాసం తొలతి అర్థభాగం శ్రీమహా విష్ణువును పూజిస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ మాసంలో సోమవారం శివుడిని మారేడు దళాలతో.. ఆదివారం సూర్యుడిని జిల్లేడు పూలతో ఆర్చిస్తారు. పుష్య మాసంలో శుక్ల పక్ష షష్ఠి రోజు శ్రీవల్లీదేవ సేన సమేత శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తారు.


ఈ మాసంలో సూర్యోదయ కాంతి యోగ చైతన్యాన్ని ప్రసరిస్తుంది. మకరరాశిలో సూర్యుడు ప్రవేశించే సమయం నుంచి ఉత్తరాయణ పుణ్య కాలం ఏర్పడుతుంది. ఈ పుణ్యకాలంలో దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా సూర్యుడి ప్రయాణం కొనసాగుతుంది. ఈ సమయంలో సూర్య కిరణాలు ప్రత్యేకమైన తేజస్సు కలిగి ఉంటాయి. ఈ సూర్య కాంతి వల్ల ప్రజలకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

వచ్చే ఏడాది ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమేనట..!

అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు..ప్రతి మెట్టుకు ఒక్కో ప్రత్యేకత..

Updated Date - Dec 26 , 2025 | 10:59 AM