Vaikuntha Ekadasi: శ్రీవారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి శోభ.. స్వామిని దర్శించుకున్న ప్రముఖులు
ABN , Publish Date - Dec 30 , 2025 | 09:22 AM
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
తిరుపతి, డిసెంబర్ 30: తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి (Vaikuntha Ekadasi) సందడి నెలకొంది. పలు దేవాలయాల్లో ఉత్తరద్వారాలు తెరుచుకోవడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. గోవింద నామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి 12:05 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఇప్పటికే శ్రీవారి కొండకు తరలివచ్చిన భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు ప్రముఖుల తాకిడి ఎక్కువగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినీ ప్రముఖులు ఉత్తర ద్వారం గుండా ఆ గోవిందుడిని దర్శించుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గోవిందుడిని దర్శించుకున్నారు. అనేక మంది రాజకీయ, సినీ ప్రముఖులు తెల్లవారుజామునే ఉత్తర ద్వారం గుండా శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు వీరే..
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, అనగాని సత్య ప్రసాద్, కొల్లు రవీంద్ర, సవిత, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, బాలకృష్ణ సతీమణి వసుంధర, నటులు రాజేంద్ర ప్రసాద్, నారా రోహిత్, శివాజీ, హీరోయిన్ శ్రీలీల, నటి హేమ, నిర్మాతలు డి.వి.వి దానయ్య, బండ్ల గణేష్, ఇండియన్ క్రికెటర్ తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, చాముండేశ్వరి నాథ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్, కళ్యాణి, దువ్వాడ శ్రీనివాస్, మాధురి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, డీకే అరుణ, ఎమ్మెల్యేలు రాజాసింగ్, మల్లారెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఇవి కూడా చదవండి...
తిరుమల స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్..
ప్రజలకు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News