CM Revanth Reddy: తిరుమల స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్..
ABN , Publish Date - Dec 30 , 2025 | 08:21 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలను దర్శించారు. ఇవాళ(మంగళవారం) ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవారిని రేవంత్ రెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు రేవంత్ కుటుంబసభ్యులకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు.
తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలను సందర్శించారు. ఇవాళ(మంగళవారం) ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవారిని రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. దేవాలయ అధికారులు రేవంత్ కుటుంబసభ్యులకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న రేవంత్ కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి పూజారులు శ్రీనివాసుడి తీర్థప్రసాదాలు అందజేశారు. మరోవైపు సాధారణ భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఏకాదశి సందర్భంగా ద్వార దర్శనం కోసం భారీగా తిరుమలకు చేరుకున్నారు. తండోపతండాలుగా వస్తున్న భక్తులతో తిరుమల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
భక్తుల తాకిడికి తగినట్లుగానే అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల సౌకర్యాలూ కల్పించారు. పోలీసులు సైతం పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా, ముక్కోటి ఏకాదశి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు కిక్కిరిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే దేవాలయాలకు భక్తులు చేరుకుంటున్నారు. తెలంగాణలో యాద్రాద్రి, భద్రాచలం, ధర్మపురి, చిలుకూరి బాలాజీ సహా పలు పుణ్యక్షేత్రాల వద్ద భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఇక, ఏపీలోని తిరుమల, సింహాద్రి అప్పన్న ఆలయం, ద్వారకా చినతిరుమల సహా వివిధ ఆలయాలకు భక్తులు తండోపతండాలుగా తరలివెళ్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
I Bomma Ravi: ఐ బొమ్మ నాది అని ఎవరు చెప్పారు?