Share News

I Bomma Ravi: ఐ బొమ్మ నాది అని ఎవరు చెప్పారు?

ABN , Publish Date - Dec 30 , 2025 | 08:18 AM

ఐ బొమ్మ నాది అని ఎవరు చెప్పారు.., బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేశానని చెప్పడానికి మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి.. అంటూ ఐ బొమ్మ రవి మీడియా ప్రతినిధులను ప్రశ్నించడం గమనార్హం. ఆయన కస్టడీ సోమవారంతో ముగిసింది. ఆయన్ను మీడియా ప్రయత్నం చేయగా.. వారినే ఎదురు ప్రశ్నించడం గమనార్హం.

I Bomma Ravi: ఐ బొమ్మ నాది అని ఎవరు చెప్పారు?

- బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేశానని చెప్పడానికి మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి

- పోలీసుల విచారణలో ఐ బొమ్మ రవి

హైదరాబాద్‌ సిటీ: నా పేరు ఐ బొమ్మ రవి కాదు. ఐ బొమ్మ నాది అని మీకు ఎవరు చెప్పారంటూ మీడియా ప్రతినిధులపై ఐ బొమ్మ రవి ఎదురుదాడికి దిగాడు. ఐ బొమ్మ రవి(I Bomma Ravi) పోలీస్‌ కస్టడీ సోమవారంతో ముగియడంతో పోలీసులు రవిని ఉస్మానియాకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. రవిని కోర్టుకు తరలిస్తున్న క్రమంలో మీడియా ప్రతినిధులు రవితో మాట్లాడే ప్రయత్నం చేశారు.


ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి ప్రశ్నలకు బదులుగా తిరిగి ప్రశ్నలు సంధించాడు. అసలు ఐ బొమ్మ నాది అని ఎవరు చెప్పారు? నేను బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసినట్లు మీ వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయి ? అని ప్రశ్నించాడు. పోలీసులు చెబితే నిజాలు అవుతాయా ? మీడియా కోర్టు కాదు నేను కోర్టులో మాట్లాడతానని సమాధానాలు ఇచ్చాడు. మీరు విదేశాలకు ఎందుకు పారిపోయారని, పైరసీ చేసినట్లు అంగీకరిస్తారా అని ప్రశ్నించగా.. తాను ఎక్కడికీ పారిపోలేదని కూకట్‌పల్లిలోనే ఉంటున్నాను అన్నాడు.


city4.2.jpg

- ఐ బొమ్మ రవిని విచారించిన క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ప్రహ్లాద్‌ అనే స్నేహితుడి ధ్రువపత్రాలతో పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందినట్లు చెప్పిన రవి.. తీరా ప్రహ్లాద్‌ను విచారణకు పిలిచినప్పుడు మౌనంగా ఉన్నాడు. ప్రహ్లాద్‌ను రవి గురించి అడుగగా.. అతను ఎవరో కూడా తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. ప్రహ్లాద్‌ జీరాక్స్‌ పత్రాలు తస్కరించిన రవి.. తానే ప్రహ్లాద్‌లా ఫొటోను మాత్రమే మార్చి మీడియేటర్‌ల సహకారంతో పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.


బ్యాంకు ఖాతాలు అంతే..

రవి వినియోగించిన బ్యాంకు ఖాతాను పరిశీలించగా.. అంజయ్య అనే పేరుతో ఉన్నట్లు పోలీసులు గుర్తించి అతని గురించి ఆరా తీయగా.. అతను కూడా ఎవరో రవికి తెలియదు. రవి ఎవరో కూడా అంజయ్యకు తెలియదని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అతని ధ్రువపత్రాలు కూడా ఏదో మార్గంలో తస్కరించి ఫొటోను మార్చి బ్యాంకు అధికారులను ఏమార్చి బ్యాంకు ఖాతాలు తీసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

2న మళ్లీ సభకు వస్తారా?

గర్భధారణ 30 ఏళ్లలోపే...

Read Latest Telangana News and National News

Updated Date - Dec 30 , 2025 | 08:18 AM