Home » Cyber Crime
సోషల్ మీడియాలో ప్రస్తుతం 1980ల రెట్రో ఫొటో ఎడిటింగ్ ట్రెండ్ వైరల్‌గా మారింది. చాలా మంది తమ ఫొటోలను 1980 దశకం నాటి ఫొటోలుగా మార్చుకుని సంబరపడిపోతున్నారు. అయితే, ఈ ట్రెండ్‌ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు.
సైబర్ నేరగాళ్లు ఒకేరోజు మూడు వేర్వేరు కేసుల్లో రూ.లక్షలు దోచుకున్నారు. స్టాక్ మార్కెట్, ఐపీఓ లాభాల పేరుతో రూ.35 లక్షల వరకు దోచేశారు.
రాష్ట్రంలో డ్రగ్స్ కన్నా సైబర్ నేరాలే తీవ్రంగా ఉన్నాయని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా అన్నారు. సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు రాష్ట్ర స్థాయిలో ‘సైబర్ గార్డ్స్’ విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. మంగళగిరిలో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి జిల్లాలో ఒక సైబర్ టీమ్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'డిజిటల్ అరెస్ట్' సైబర్ నేరాలపై CBI ఉక్కుపాదం మోపింది. 'ఆపరేషన్ చక్ర-VI'లో భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టి ముగ్గుర్ని అరెస్ట్ చేసింది.
సైబర్ మోసాల్లోనూ ‘గోల్డెన్ అవర్’ కీలకమని పోలీసులు అంటున్నారు. ఆన్‌లైన్ మోసానికి గురైన వెంటనే బాధితులు ఫిర్యాదు చేస్తే మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిన డబ్బును రికవరీ చేయవచ్చని చెబుతున్నారు.
డిజిటల్ అరెస్ట్ పేరుతో 85 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) అధికారినంటూ గుర్తుతెలియని వ్యక్తి బాధితుడికి ఫోన్ చేశాడు.
చనిపోతానని బెదిరించి ఓ యువతి నుంచి రూ.కోటిన్నర కొట్టేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. స్నాప్‌చాట్‌లో యువతితో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు.. ఆమెను నమ్మించి మోసం చేశాడు.
హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఒక్కరోజే సైబర్ నేరగాళ్లు రూ. 33.98 లక్షలు కొల్లగొట్టారు. వివరాలిలా ఉన్రాయి.
జగిత్యాల జిల్లాలో సైబర్ మోసం కలకలం రేపుతోంది. స్నేహితుడి నంబర్‌తో వచ్చిన ఓ మెసేజ్‌ను ఓపెన్ చేసిన వెంటనే దాదాపు నాలుగు లక్షల నగదు మాయమవడం సంచలనం సృష్టిస్తోంది.
నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. సైబర్ నేరాల బారినపడుతున్న వారిలో రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారని పేర్కొన్నారు.