Hyderabad: అమ్మో.. రూ.27 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..
ABN , Publish Date - Jan 13 , 2026 | 10:21 AM
హైదరాబాద్ మహానగరంలో సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఈ సైబర మోసాలు జరుగుతూనే ఉన్నాయి. లక్షలాది రూపాయలు నష్టపోతూనే ఉన్నారు. తాజాగా మరో మోసం వెలుగులోకి వచ్చింది.
- ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసం
- రూ.27 లక్షలు వసూలు చేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ: ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్రకటన చూసి, సంప్రదించిన నగరాసికి సైబర్ నేరగాళ్లు(Cyber criminals) కుచ్చుటోపీ పెట్టారు. ఆసి్‌ఫనగర్‌కు చెందిన వ్యక్తి (38) ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయన్న ప్రకటన చూసి నిర్వాహకులను సంప్రదించాడు. ముందుగా బాధితుడిని వాట్సాప్ గ్రూపు(WhatsApp group)లో చేర్చారు. తర్వాత ఏడీవీపీఎంఏ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టాలని సూచించగా ముందుగా రూ. 10 వేలతో ప్రారంభించాడు.

యాప్‌లో లాభాలు వచ్చినట్లు చూపడంతో పెట్టుబడులు పెంచుకుంటూ రూ.27 లక్షల వరకు సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాలకు బదిలీ చేశాడు. తాను పెట్టిన పెట్టుబడితోపాటు లాభం కలిపి యాప్‌లో రూ.81.69 లక్షలు ఉన్నట్లు చూపించగా.. విత్‌డ్రా చేసుకునే యత్నం చేశాడు. డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే మరో రూ. 50 లక్షలు పెట్టుబడి పెట్టాలని షరతు విధించారు. దాంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి.
వందేభారత్ స్లీపర్‌లో నో ఆర్‌ఏసీ
‘తుంగభద్ర’ గేటు ట్రయల్‌రన్ సక్సెస్
Read Latest Telangana News and National News