డిజిటల్ అరెస్టుల పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మవద్దు

ABN, Publish Date - Jan 04 , 2026 | 04:16 PM

డిజిటల్ అరెస్టుల పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ కే.వి.ఎం ప్రసాద్ తెలిపారు. సోమాజిగూడకు చెందిన వృద్ధుడి నుంచి రూ.7 కోట్లు సైబర్ కేటుగాళ్లు కాజేశారని ఆయన వెల్లడించారు.

హైదరాబాద్, జనవరి 4: డిజిటల్ అరెస్టులపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒకచోట ఈ తరహా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఓ భారీ డిజిటల్ అరెస్ట్ మోసం బయట పడింది. ఈక్రమంలో ప్రముఖ మీడియా ఏబీఎన్ ఛానల్‌లతో హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ కే.వి.ఎం ప్రసాద్ మాట్లాడుతూ.. డిజిటల్ అరెస్టులకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. డిజిటల్ అరెస్టుల పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మవద్దని ఆయన తెలిపారు. సోమాజిగూడకు చెందిన వృద్ధుడి నుంచి రూ.7 కోట్లు సైబర్ కేటుగాళ్లు కాజేశారని ఆయన తెలిపారు. అనుమానాస్పద రీతిలో కాల్స్ వస్తే తమకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.


Also Read:

Priyanka Gandhi: అస్సామ్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ప్రియాంక గాంధీ

JBL Speaker Viral Video: ఇలాక్కూడా జరుగుతుందా! ఇదేంటో తెలిస్తే.. వైరల్ వీడియో

Updated at - Jan 04 , 2026 | 04:44 PM