Share News

Cyber Crime: నగరంలో మరో సైబర్ మోసం.. రూ.2.42 లక్షలకు టోకరా

ABN , Publish Date - Jan 06 , 2026 | 06:51 AM

హైదరాబాద్ మహానగరం సైబర్ మోసాలకు అడ్డాగా మారిందనే విమర్శలొస్తున్నాయి, ప్రతిరోజు, ప్రతిరోజు, ఎవరోఒకరు, ఎక్కడో ఓచోట ఈ సైబర్ మోసానికి బలవుతూనే ఉన్నారు. తాజాగా కాచిగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈ సైబర్ మోసానికి గురయ్యాడు.

Cyber Crime: నగరంలో మరో సైబర్ మోసం.. రూ.2.42 లక్షలకు టోకరా

- కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులమంటూ బురిడీ కొట్టించిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: కొత్త ఏడాది వేడుకలను క్రూజ్‌లో జరుపుకుందామని భావించి ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసిన నగరవాసిని క్రూజ్‌ కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులమంటూ సంప్రదించి కొందరు మోసం చేశారు. రూ.2.42లక్షలు వసూలు చేశారు. కాచిగూడ(Kachiguda) ప్రాంతానికి చెందిన వ్యక్తి తన కుటుంబంతో కలిసి కొత్త ఏడాది వేడుకలు క్రూజ్‌లో జరుపుకోవాలని భావించాడు. దీనికోసం డిసెంబరు 26న ఆన్‌లైన్‌లో వెతికాడు. ఈ సందర్భంలో కొచ్చి, లక్షద్వీ్‌పల మీదుగా ముంబైకి క్రూజ్‌ సేవలందించే వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేశాడు.


తర్వాత వాట్సప్‌ కాల్‌ చేసిన వ్యక్తులు తమను తాము కార్డెలియా క్రూజ్‌ కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులమని చెప్పుకున్నారు. క్రూజ్‌లో నలుగురు సభ్యుల ప్రయాణం చేస్తామని, విడతల వారీగా డబ్బు చెల్లిస్తామని చెప్పడంతో ముందుగా అడ్వాన్స్‌ పేరుతో రూ.23.680 వసూలు చేశారు. తర్వాత లక్షద్వీప్‌ వెళ్లాలంటే ప్రత్యేక అనుమతులు కావాలంటూ కొంత, పిల్లలకు అదనపు చార్జీల పేరుతో మరికొంత వసూలు చేశారు.


city1.2.jpg

చెల్లింపుల సమయంలో సాంకేతిక సమస్యలు వచ్చాయని చెబుతూ రీఫండ్‌ చేస్తామని పలు దఫాలుగా రూ.2.42 లక్షలు వసూలు చేశారు. చివరికి సాంకేతిక కారణాల వల్ల పేమెంట్‌ నిలిచిపోయిందని చెబుతూ బుకింగ్‌ రద్దు అయిందన్నారు. కేన్సిలేషన్‌ చార్జీల పేరుతో మరో రూ.48,500 చెల్లించాలని డిమాండ్‌ చేయడంతో బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ప్రియులకు అలర్ట్.. మరింత పెరిగిన బంగారం ధర..

బీసీ కులగణనపై ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేశారా..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 06 , 2026 | 06:51 AM