Home » Cyber attack
సైబర్ నేరగాళ్లు సరికొత్త పంధాను ఎంచుకున్నారు. సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో బ్యాంకులు, ప్రభుత్వ సేవల పేర్లతో సైబర్ నేరగాళ్లు ఏపీకే లింక్‌లు పంపుతున్నారు. ఈ లింక్‌లను ఓపెన్ చేస్తే.. ఖాతాలో ఉన్న నగదు మొత్తం మాయమైపోతోంది. ఈ తరహ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీస్ యంత్రాంగం సూచిస్తోంది.
తన డిపార్ట్‌మెంట్ ఉద్యోగి పంపిన లింక్‌ను ఓపెన్ చేసిన ఓ వీఆర్‌ఓ రూ.1.19 లక్షలు పోగొట్టుకున్న సంఘటన పెనుకొండలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలైన వీఆర్‌ఓ యశస్విని తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
సైబర్ మోసాల కేసుల్లో కీలక పాత్రధారులు తప్పించుకుంటున్నారు. నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలను ఇచ్చిన వారిని మాత్రమే పోలీసులు అరెస్టు చేయగలుగుతున్నారు. ఈ క్రమంలో సైబర్ క్రైం విభాగం దర్యాప్తు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జలమండలి అధికారి పేరిట ఓ సైబర్ నేరగాడు ఓ వృద్ధుడి నుంచి రూ.2.30 లక్షలు కాజేశాడు. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. సీతాఫల్‌మండికి చెందిన రిటైర్డ్ ప్రభుతోద్యోగికి వాటర్ బోర్డు నుంచి నీటి బిల్లు వెరిఫికేషన్ కోసమంటూ ఓ అగంతకుడు ఈనెల 15వ తేదీన పలుమార్లు కాల్ చేశాడు.
రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసపూరితమైన ఏపీకే ఫైల్ లింకులు పంపి.. అమాయకుల ఫోన్లను హ్యాక్ చేస్తూ వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నగరానికి చెందిన ఐదుగురు ఖాతాల నుంచి రూ.16.31 లక్షలు కాజేశారు.
నకిలీ ట్రేడింగ్ యాప్ పేరుతో ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.21.93 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ డీసీపీ సాయి తెలిపిన వివరాల ప్రకారం.. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు, ఇతర సోషల్ మీడియా చానళ్ల ద్వారా ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రచారం చేశారు.
ఏపీకే ఫైల్స్ పంపి, వాటిని క్లిక్ చేయగానే ఫోన్ హ్యాక్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోయర్ ట్యాంక్‌బండ్‌కు చెందిన బాధితుడికి హెచ్‌బీఎఫ్సీ బ్యాంకు నుంచి రెండు ఎస్సెమ్మెస్‌లు వచ్చాయి.
హైదరాబాద్‌లో సైబర్ అవేర్‌నెస్ ఉన్నప్పటికీ, ఇంకా బాధితులు ఉన్నారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ బాధితులు తగ్గేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి.
ప్రతి రోజు లక్షల్లో సైబర్ ఫ్రాడ్ జరుగుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. పెట్టుబడులు పెట్టీ చాలా యాప్‌లలో పలువురు మోసపోతున్నారని చెప్పుకొచ్చారు. డిజిటల్ అరెస్ట్‌పై కూడా అవగాహన కల్పించామని పేర్కొన్నారు సీపీ సజ్జనార్.
ట్రేడింగ్ యాప్ పేరుతో సైబర్ నేరగాళ్లు కోటిన్నర రూపాయలు కొట్టేశారు. తిరుపతిలో ఉండే చైతన్య కుమార్, వెంకటేష్‌కు ఆన్లైన్ ద్వారా ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది..