Share News

Hyderabad: నగరంలో మరో కొత్తమోసం వెలుగులోకి.. న్యూడ్‌ వీడియో కాల్‌ స్కామ్‌..

ABN , Publish Date - Dec 20 , 2025 | 11:08 AM

సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసానికి తెరలేపారు. అమ్మాయితో న్యూడ్ వీడియో కాల్ చేయించి.. ఆ తర్వాత బెదింపులకు పాల్పడుతున్నారు. తాజాగా నగరానికి చెందిన ఓ యువకుడు ఈ తరహ మోసానికి బలైపోయి రూ.3.41 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: నగరంలో మరో కొత్తమోసం వెలుగులోకి.. న్యూడ్‌ వీడియో కాల్‌ స్కామ్‌..

- అమ్మాయితో వీడియో కాల్‌ చేయించి..

- వైరల్‌ చేస్తామని బ్లాక్‌మెయిల్‌

- రూ.3.41 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: అమ్మాయితో వీడియో కాల్‌ చేయించి, నగ్నంగా ఉన్న వీడియోలు రికార్డ్‌ చేసి బెదిరింపులకు పాల్పడిన సైబర్‌ నేరగాళ్లు(Cyber criminals) నగరానికి చెందిన యువకుడి నుంచి రూ.3.41 లక్షలు వసూలు చేశారు. డబ్బులు చెల్లించినా.. ఇంకా వేధింపులు పెరగడంతో బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. గౌలిగూడ ప్రాంతానికి యువకుడికి అక్టోబరు 5 రాత్రి 1.30 గంటలకు వీడియో కాల్‌ వచ్చింది. తన పేరు జ్యోతి గుప్తా అని తెలిపిన యువతి, వీడియో కాల్‌లో నగ్నంగా మారేలా యువకుడిని రెచ్చగొట్టింది.


తర్వాత యూనిఫాం దరించిన వ్యక్తి తనకు తాను పోలీస్‌ అధికారి విక్రం గోస్వామి అని పరిచయం చేసుకున్నాడు. అమ్మాయితో అసభ్యకరంగా వీడియోకాల్‌ చేశావని, దీనిపై కేసు నమోదైందని చెప్పాడు. వీడియో చూపిస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసి పరువు తీస్తానని బెదిరించాడు. ఇలా చేయకుండా ఉండాలంటే డబ్బు ఇవ్వాలంటూ పలుమార్లు డబ్బు బదిలీ చేయించుకున్నాడు. కేసు ముగిసిన తర్వాత రీఫండ్‌ అవుతాయని మరికొంతవసూలు చేశాడు.


city7.2.jpg

అంతేకాకుండా బాధితుడి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకొని అందులో ఉన్న డబ్బు సైతం కాజేశారు. వీడియో కాల్‌ మాట్లాడిన యువతి చనిపోయిందని, ఇంకా డబ్బు చెల్లించాలని డిమాండ్‌ చేయడంతో బాధితుడు సైబర్‌ క్రైం అధికారులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం..ఆదుకోండి!

బ్యాంకింగ్‌ వదిలి చాక్లెట్‌ మేకింగ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 20 , 2025 | 11:08 AM