Home » Crime
వరంగల్ నల్లబెల్లి మండలం కొండాపురంలో గురువారం మరో దారుణం జరిగింది. అన్నపై తమ్ముడు ఘోరంగా కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన వదినపై సైతం కత్తితో దాడి చేశాడు. అన్న రమేశ్పై తమ్ముడు మేరుగుర్తి సురేశ్ కత్తితో దాడి చేశాడు.
తెలుగులో తొలి నేపథ్య గాయని బాల సరస్వతి(97) మృతి చెందారు. హైదరాబాద్లో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆరేళ్ల వయసు ఉన్నప్పటినుంచే బాల సరస్వతి పాటలు పాడడం మొదలుపెట్టారు.
గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలో ఇవాళ దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తి హత్యకు గురయ్యాడు. కైలాష్ భవన్ రోడ్డులో టిఫిన్ సెంటర్ వద్ద కొబ్బరికాయల కత్తితో జ్యూటూరి బుజ్జి(50) అనే వ్యక్తిని దుండగుడు నరికి చంపారు. సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకున్నారు. దుండగుడు స్కూటీపై మాస్క్ వేసుకొని వచ్చి హత్య చేసి పరార్ అయినట్టు స్థానికులు చెబుతున్నారు.
జార్ఘండ్ రాజధాని రాంచీలోని రతు ప్రాంతంలో 14 ఏళ్ల బాలిక తన కుటుంబంతో నివాసం ఉంటుంది. అయితే ఆదివారం ఆ బాలికపై కామాంధులు కాటేశారు. రాత్రి సమయంలో 9 మంది వ్యక్తులు ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్ర శివారు ఖమ్మం - వరంగల్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో అక్కడనున్న స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
మెదక్ జిల్లా జానకంపల్లి పంచాయతీ సమీపంలోని ఒక తండా నుంచి కూలీ పని కోసం ఓ మహిళ మెదక్ జిల్లా కేంద్రానికి వచ్చింది. కూలీ పని ఉందని నమ్మించిన దుండగులు.. కోల్పారం మండలం అప్పాజిపల్లి శివారు ఏడుపాయల రోడ్డు వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.
ఇద్దరు పిల్లల తండ్రి అత్యాచారం చేయడంతో 15 ఏళ్ల మైనర్ బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. నామక్కల్ గవర్నమెంట్ ఆసుపత్రిలో మైనర్ ప్రసవించింది. ఈ విషయాన్ని హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా నిందితుడు ఇద్దరు పిల్లలకు తండ్రి అని తేలింది. ఇతని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉదయ్ కిరణ్ అనే అబ్బాయి లవ్ చేస్తున్నానని నమ్మబలికి యువతిని శారీరకంగా లొంగ దీసుకున్నాడు. పలు మార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అనే మరో వ్యక్తి యువతిపై అత్యాచారం చేసేందుకు కుట్ర పన్నాడు. ఎలాగైనా ఆ యువతిపై తన కామవాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. ఉదయ్ కిరణ్ తో ఉన్న సంబంధాన్ని బయటపెడతానని బాధితురాలిని పవన్ కళ్యాణ్ బెదిరించాడు. వీరిద్దరి విషయం బయటికి చెబుతానని బెదిరించి యువతిపై అత్యాచారం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
జనగామ జిల్లా సబ్ జైల్లో బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి ఖైదీ ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని వరంగల్లోని మహాత్మగాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన మల్లయ్యగా గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చి సబ్ జైలు ముందు ఆందోళన చేపట్టారు.
కొందరు కిలేడీలు పెళ్లిళ్లు చేసుకొని భర్తను చంపి డబ్బునంతా స్వాహా చేస్తుంటే.. మరికొందరు వింత వింత ఆలోచనలతో డబ్బును లూటీ చేసే పనిలో పడ్డారు. రూ.కోట్లు కొల్లగొడుతూ అక్కడినుంచి చెక్కేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఏడాదిపాటు నమ్మకంగా ఉండి, డబ్బు మళ్ళీ తిరిగి ఇస్తానని నమ్మించి రూ.కోట్లు కొల్లగొట్టి అక్కడినుంచి ఓ ఖిలాడీ లేడి చెక్కేసిన ఘటన ఇది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..