Wife Attacks Husband: భర్తపై మరిగే నీళ్లు, యాసిడ్ పోసిన భార్య.. ఎందుకంటే..
ABN , Publish Date - Oct 22 , 2025 | 09:11 AM
భర్తపై మరిగే నీళ్లు, యాసిడ్ పోసింది ఓ భార్య. అసలు, భార్య అంత దారుణంగా ఎందుకు ప్రవర్తించింది? అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్తపై భార్య మరిగే నీళ్లు పోసింది. అంతటితో ఆమె ఆగలేదు. మళ్లీ, యాసిడ్ పోసేసింది. భర్త తీవ్రంగా గాయపడటంతో వెంటనే స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. భర్త ఫిర్యాదు ఆధారంగా భార్యను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..
33 ఏళ్ల రోనక్ అనే వ్యక్తి వివాహం చేసుకుని రెండేళ్లు అయింది. అయితే, ఆమె భర్తకు వేరే మహిళతో సంబంధం ఉందని భార్య అనుమానిస్తూ ఉండేది. చిన్న చిన్న విషయాలకే ఎప్పుడూ గొడవలు పడుతుండేవారని స్థానికులు తెలిపారు. ఈ జంట గతంలో వేజల్‌పూర్‌లో నివసించారు. అయితే, అక్కడ కూడా గొడవలు పడుతుండటంతో పోలీసులు రాజీ కుదిరించడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీపావళి రోజున ఉదయం మళ్ళీ వారిద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత భార్యపై అసహనంతో భర్త బెడ్ రూమ్‌కు వెళ్లి నిద్రపోయాడు. అయితే, భార్య మాత్రం తన కోపాన్ని కంట్రోల్ చేసుకులేకపోయింది. ఇక ఆవేశంలో నిద్రపోతున్న భర్తపై మరిగే నీళ్లు పోసింది.
నిద్రలో ఉలిక్కిపడ్డ భర్త వెంటనే గట్టిగా కేకలు వేసి భార్య నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వేడి నీళ్లు పడిన బట్టలను తీసేయడానికి ప్రయత్నించాడు. కానీ, భార్య అతనిపై యాసిడ్ దాడి చేసింది. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతడి చావు కేకలకు అప్రమత్తమై హుటాహుటినా రోనక్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో అల్లడుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు భార్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి