Share News

Sahiti Infra: సాహితీ ఇన్‌ఫ్రా ఆస్తులను జప్తు చేసిన ఈడీ

ABN , Publish Date - Oct 24 , 2025 | 09:16 PM

సాహితీ ఇన్‌ఫ్రా ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. రూ.12.65 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. ఫ్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో సాహితీ ఇన్‌ఫ్రా మోసం చేసినట్లు గుర్తించిన అధికారులు.. కంపెనీ డైరెక్టర్ పూర్ణచందర్‌రావుతో పాటు కుటుంబ సభ్యులపై మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Sahiti Infra: సాహితీ ఇన్‌ఫ్రా ఆస్తులను జప్తు చేసిన ఈడీ
Sahiti Infra

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 24: హైదరాబాద్‌లోని సాహితీ ఇన్‌ఫ్రా ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. రూ.12.65 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. ఫ్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో సాహితీ ఇన్‌ఫ్రా మోసం చేసినట్లు గుర్తించిన అధికారులు.. కంపెనీ డైరెక్టర్ పూర్ణచందర్‌రావుతో పాటు కుటుంబ సభ్యులపై మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు.


ఈ సంస్థ ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో బాధితుల నుంచి రూ.842 కోట్లు వసూలు చేసినట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. రెరా (RERA), హెచ్ఎండీఏ నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్టు వెల్లడయింది. రూ.216.91 కోట్లు లెక్కల్లో చూపలేదని అధికారులు తెలిపారు. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బుతో.. కంపెనీ డైరెక్టర్లు స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఇప్పటివరకు ఈడీ రూ.161.50 కోట్ల ఆస్తులు సీజ్‌ చేసింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని.. లక్ష్మీనారాయణ, పూర్ణచంద్రరావు జైలులో ఉన్నారని అధికారులు వివరించారు.


ఇది కూడా చదవండి:

HYDRAA: ఆక్రమణల తొలగింపు.. 2 వేల గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

Updated Date - Oct 24 , 2025 | 10:01 PM