Share News

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ABN , Publish Date - Oct 24 , 2025 | 06:11 PM

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లని ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ రేవంత్‌రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
Telangana Government

హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్ల (Additional Collectors)ని ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లు (Forest Settlement Officers) గా నియమిస్తూ రేవంత్‌రెడ్డి సర్కార్ (Revanth Reddy Govt) ఉత్తర్వులు జారీ చేసింది. జాయింట్ కలెక్టర్ పదవి రద్దు చేసి.. కొత్త బాధ్యతలని అదనపు కలెక్టర్లకు అప్పగించింది.


ఈ క్రమంలో అడవి భూసర్వే, హక్కుల నిర్ధారణ, సెటిల్‌మెంట్ పనులు వీరి పరిధిలోకి రానున్నాయి. 1967 ఫారెస్ట్ యాక్ట్ కింద ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ పర్యవేక్షణలో అమలు చేయనుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి...

అంగ‌న్వాడీ సరకుల సరఫరాలో అలసత్వం వహిస్తే బ్లాక్ లిస్టులో పెట్టాలి: మంత్రి సీతక్క వార్నింగ్

బస్సు ప్రమాదంపై కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు.. నంబర్లివే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 24 , 2025 | 08:38 PM