Share News

HYDRAA: ఆక్రమణల తొలగింపు.. 2 వేల గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా

ABN , Publish Date - Oct 24 , 2025 | 08:48 PM

కొండాపూర్‌లాంటి ఖ‌రీదైన ప్రాంతంలో ఏకంగా 2000 గ‌జాల పార్కు స్థ‌లాన్ని హైడ్రా శుక్ర‌వారం కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్ గ్రామంలోని రాఘ‌వేంద్ర కాల‌నీలో పార్కుతో పాటు.. క‌మ్యూనిటీ హాలు నిర్మాణానికి 2 వేల గ‌జాల‌ను లే ఔట్‌లో చూపించారు. పార్కు స్థలం ఖాళీగా ఉండటంతో అక్రమార్కులు ఆ స్థలాన్ని కబ్జా చేయడంపై దృష్టి పెట్టారు.

HYDRAA: ఆక్రమణల తొలగింపు.. 2 వేల గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా
HYDRAA

హైదరాబాద్, అక్టోబర్ 24: అక్రమ నిర్మాణాల కూల్చివేతలే ధ్యేయంగా హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. పార్కును క‌బ్జా చేసి.. బై నంబ‌ర్లు సృష్టించి సొంతం చేసుకునే ప్ర‌య‌త్నాల‌కు హైడ్రా అడ్డుకట్ట వేసింది. కొండాపూర్‌లాంటి ఖ‌రీదైన ప్రాంతంలో ఏకంగా 2000 గ‌జాల పార్కు స్థ‌లాన్ని హైడ్రా శుక్ర‌వారం కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్ గ్రామంలోని రాఘ‌వేంద్ర కాల‌నీలో పార్కుతో పాటు.. క‌మ్యూనిటీ హాలు నిర్మాణానికి 2 వేల గ‌జాల‌ను లే ఔట్‌లో చూపించారు. పార్కు స్థలం ఖాళీగా ఉండటంతో అక్రమార్కులు ఆ స్థలాన్ని కబ్జా చేయడంపై దృష్టి పెట్టారు.


బై నంబ‌ర్లు సృష్టించి 10 ప్లాట్లు చేసేశారు. ప్ర‌తి ప్లాట్‌లో ఒక షెడ్డు వేశారు. దీనిపై రాఘ‌వేంద్ర కాల‌నీ సి బ్లాక్‌ వెల్ఫేర్ అండ్ క‌ల్చ‌ర‌ల్ అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌ నుంచి ప్ర‌జావాణికి ఫిర్యాదు అందింది. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల‌తో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్ర స్థాయిలో సంబంధిత శాఖ‌ల‌తో క‌లిసి ప‌రిశీలించారు. పార్కుతో పాటు.. క‌మ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన స్థ‌లంగా నిర్ధారించారు. రంగ‌నాథ్‌ ఆదేశాల మేర‌కు ఆక్ర‌మ‌ణ‌ల‌ను శుక్ర‌వారం తొల‌గించారు. ఆ వెంట‌నే ఫెన్సింగ్ వేసి పార్కు స్థ‌లాన్ని హైడ్రా కాపాడిన‌ట్టు పేర్కొంటూ బోర్డులు ఏర్పాటుచేశారు. ఈ పార్కు స్థ‌లం విలువ దాదాపు రూ. 30 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

Jubilee Hills Bye Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. స్పీడ్ పెంచిన పార్టీలు

Updated Date - Oct 24 , 2025 | 09:18 PM